English | Telugu
మర్యాద రామన్న స్పీడ్ పెంచుతున్నాడు!
Updated : Feb 22, 2023
ఒకనాడు ఆయన స్టార్ కమెడియన్ హీరోల పక్కన స్నేహితుడిగా నటిస్తూ వచ్చిన కమెడియన్ సునీల్‌కి కామెడీ కింగ్‌గా మంచి డిమాండ్ ఉండేది. విడుదలైన ప్రతి చిత్రంలోనూ సునీల్ కనిపించి నవ్వించేవారు. కానీ ఎందుకనో ఈయనకు హీరోగా మారితే ఎలా ఉంటుందా? అనే ఒక ఆశపట్టుకుంది. బంగారు బాతుగుడ్డు లాంటి కమెడియన్ పాత్రలను వదిలేసి హీరోగా మారారు. అది కూడా ఏదో ఆటలో ఆటవిడుపుగా ఒకటి రెండు చిత్రాలే అని అందరు భావించారు. కానీ ఈయన మాత్రం హీరో పాత్రలు తప్పితే మరే పాత్ర చేయనని భీష్మించుకుని కూర్చున్నారు. మర్యాద రామన్న, పూలరంగడు, అందాల రాముడు, తడాఖా వంటి పలు చిత్రాలలో హీరోగా నటించారు. ఇవ్వన్నీ హిట్టయిన చిత్రాలు మాత్రమే. ఫ్లాప్ లిస్ట్ తీసుకుంటే చాంతాడంత అవుతుంది. కానీ వరుస పరాజయాలతో ఆ తర్వాత మరల కొయూటర్న్ తీసుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా, ప్లస్ విలన్ గా కూడా మెప్పిస్తున్నారు.
కొంత గ్యాప్ తీసుకున్న సరే తన కెరీర్ ని మరలా గాడిలో పెట్టారు. అరవింద సమేత వీర రాఘవ చిత్రంతో అతనికి ఒక మంచి పాత్రను క్రియేట్ చేశారు అతని స్నేహితుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్. స్టార్ హీరోల చిత్రాలతో సహా చిన్నాచితక సినిమాల్లోనూ నటిస్తున్నారు. రోజుకి ఆరు షిప్ట్ లు పనిచేస్తున్నారు. ఏడాదికి ఆయన చేస్తున్న చిత్రాలు మూడు పువ్వులు.... ఆరుకాయలుగా సాగుతోంది. గత ఏడాది ఏకంగా 13 సినిమాలు చేశారు. ప్రస్తుతం ఆయన పుష్ప2 నటిస్తున్నారు. పుష్పాలో మంగళం శీను పాత్రతో పాన్ ఇండియాలో ఫేమస్ అయ్యారు.
అందులోని ఆయన ఆహార్యానికి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. దీనిని సునీల్ కెరీర్ కి టర్నింగ్ ఇచ్చిన చిత్రంగా చెప్పవచ్చు. సునీల్ కెరీర్ దీనిని ఓ గొప్ప చిత్రంగా చెప్పవచ్చు. తనలోని కొత్త నటుడిని బయటకు తీసుకుని వచ్చింది. ఇంకా కొన్ని అవకాశాలు చేతిలో ఉన్నాయి. చిన్న బ్యానర్లు ఇప్పటికీ అతను హీరోగా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. కోలీవుడ్ లోనూ లాంచ్ అవుతున్నారు. అక్కడ నాలుగు సినిమాలు చేస్తున్నారు. మా వీరన్, జపాన్, రజనీకాంత్ నటిస్తున్న జైలర్, మార్క్ ఆంటోని వంటి చిత్రాలలో కీలకమైన పాత్రలు చేస్తున్నారు. మొత్తానికి సునీల్ ఇప్పుడు బహు భాషా చిత్రాల నటునిగా పేరు తెచ్చుకున్నారు. ఏ పాత్రలకైనా సై అంటున్నారు. హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్, విలన్ ఇలా అన్నింటికీ ఓకే చెప్తున్నారు. అన్నిరకాల పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. దాంతో దర్శక నిర్మాతలు ఆయనకు అవకాశం ఇవ్వడానికి ఏగబడుతున్నారు.