English | Telugu

హీరో, డైరెక్టర్‌ మధ్య భీకర యుద్ధం.. అదే ‘కాంత’ సినిమా కథ!

మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి నట వారసుడుగా ఇండస్ట్రీకి వచ్చిన దుల్కర్‌ సల్మాన్‌.. నటుడిగానే కాకుండా సింగర్‌గా కూడా తన ప్రతిభ కనబరిచారు. 2012లో మలయాళ చిత్రం ‘సెకండ్‌ షో’ ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేసిన దుల్కర్‌.. మలయాళ, తమిళ్‌, తెలుగు, హిందీ భాషల్లో వైవిధ్యమైన సినిమాలు చేశారు. తన ప్రతి సినిమా విభిన్నంగా ఉండాలని కోరుకునే దుల్కర్‌.. ‘కాంత’ అనే మరో డిఫరెంట్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జూలై 28 దుల్కర్‌ సల్మాన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు.

‘కాంత’ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రానా దగ్గుబాటితో కలిసి నిర్మిస్తున్నారు దుల్కర్‌ సల్మాన్‌. 1930వ దశకంలో తమిళ రంగంలో సూపర్‌స్టార్‌గా వెలుగొందిన ఎం.కె.త్యాగరాజ భాగవతార్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని తెలుస్తోంది. సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హై ఎమోషన్స్‌ ఉన్నట్టుగా టీజర్‌ చూస్తే తెలుస్తుంది. ఏ పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోయే దుల్కర్‌.. త్యాగరాజ భాగవతార్‌ పాత్రలోనూ ఒదిగిపోయారని అర్థమవుతోంది. ఈ సినిమాలో డైరెక్టర్‌గా సముద్రఖని ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. హీరో, డైరెక్టర్‌ మధ్య వచ్చే ఇగో క్లాషెస్‌ ప్రధానంగా ఈ సినిమాలో ఉంటాయని తెలుస్తోంది.

ప్రతి చిన్న విషయానికి హీరో, డైరెక్టర్‌ విభేదించడం.. తద్వారా ఇద్దరూ ఆనందం పొందడాన్ని ఎంతో ఆసక్తికరంగా చూపించారు. పాత రోజుల్లో సినిమాల నిర్మాణం ఎలా జరిగేది, అప్పటి వాతావరణం ఎలా ఉండేది అనే అంశాలను తెరపై చక్కగా ఆవిష్కరించారు. దుల్కర్‌ సల్మాన్‌, సముద్రఖని పోటీపడి నటించారు. ముఖ్యంగా దుల్కర్‌ గెటప్‌ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. అయితే ఈ టీజర్‌లో కనిపించిన ఒకే ఒక బ్యాక్‌డ్రాప్‌.. డబ్బింగ్‌. సముద్రఖని చెప్పిన డైలాగ్స్‌లో కథానాయకుడు, కథానాయకి అనడానికి బదులుగా.. ఖథానాయకుడు, ఖథానాయకి అని ఒత్తి మరీ పలకడం చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. మరి దీన్ని తర్వాతైనా సరిచేస్తారో లేక అలాగే ఉంచేస్తారో చూడాలి. మొత్తానికి ‘కాంత’ టీజర్‌ మాత్రం అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. సెప్టెంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా దుల్కర్‌ సల్మాన్‌ సినిమాల్లో మరో మైల్‌స్టోన్‌గా నిలిచిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .