English | Telugu

ఎన్టీఆర్ డెడికేషన్ కి హ్యాట్సాఫ్!

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దేవర'. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్, విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్ లో జరిగిన మొదటి షెడ్యూల్ లో తారక్, సైఫ్ పై కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కి చిన్న బ్రేక్ ఇచ్చిన తారక్, ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెకేషన్ కి వెళ్ళాడు. అయితే అక్కడికి వెళ్లి కూడా ఆయన 'దేవర' కోసం కష్టపడుతుండటం విశేషం.

ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా నిన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన తారక్.. ఆ తర్వాత భార్య పిల్లలతో కలిసి విదేశీ టూర్ కి వెళ్ళాడు. షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి విదేశాలకు వెళ్ళాడు, సరదాగా ఫ్యామిలీతో గడుపుతాడు అనుకుంటే.. తారక్ ఉదయాన్నే జిమ్ లో దర్శనమిచ్చి షాకిచ్చాడు. కొంతకాలంగా తారక్ బాడీ మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాడు. సినిమాకి తగ్గట్టుగా తన శరీరాకృతిని మలుచుకుంటున్నాడు. 'దేవర' షూటింగ్ ప్రారంభం కావడానికి కొన్ని నెలల ముందు కాస్త బొద్దుగా కనిపించిన తారక్, షూటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి ఫిట్ గా తయారయ్యాడు. అదే ఫిట్ నెస్ ని, శరీరాకృతిని సినిమా పూర్తయ్యేవరకు మైంటైన్ చేయాలనే ఉద్దేశంతో జిమ్ కి బ్రేక్ ఇవ్వడం లేదు. ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్ళినప్పటికీ వీలు చూసుకొని మరీ జిమ్ లో కష్టపడుతున్నాడు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆయన జిమ్ ట్రైనర్ కుమార్ మన్నావా సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేశాడు. అంతేకాదు "ఒక్కసారి ప్రిపరేషన్ ప్రారంభించాక హాలిడే కూడా దేవరకు అడ్డంకి కాదు.. ఆయన డెడికేషన్ అలాంటిది" అంటూ తారక్ గురించి రాసుకొచ్చాడు. దీంతో తారక్ డెడికేషన్ పై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.