English | Telugu

‘గుంటూరు కారం’ సినిమాకి సంబంధించి ఆ క్రెడిట్‌ అంతా తమన్‌దే!

ఒక భారీ చిత్రానికి ఆర్టిస్టుల పరంగా, టెక్నీషియన్స్‌ పరంగా మార్పులు చేర్పులు జరగడం అనేది సర్వసాధారణమైన విషయం. అయితే షూటింగ్‌ ప్రారంభం అవకముందు చాలా సినిమాలకు అలా జరిగింది. కానీ, మహేష్‌బాబు వంటి స్టార్‌ హీరో, త్రివిక్రమ్‌ వంటి స్టార్‌ డైరెక్టర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘గుంటూరు కారం’ చిత్రానికి రకరకాల మార్పులు చోటు చేసుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే.

ఇప్పటివరకు ఈ సినిమాకు జరిగిన మార్పులు ఏమిటి? అనేది ఒకసారి పరిశీలిస్తే... షూటింగ్‌ మొదలైన తర్వాత ఒక దశలో స్క్రిప్ట్‌ మారింది. ఫైట్‌ మాస్టర్లు, హీరోయిన్‌.. ఇలా అందరూ వరసపెట్టి ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. అయితే దానికి గల కారణాలు మాత్రం ఎవ్వరికీ తెలియలేదు. త్రివిక్రమ్‌ డైరెక్ట్‌ చేసిన కొన్ని సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన పి.ఎస్‌.వినోద్‌ కూడా ఈ సినిమాకి గుడ్‌బై చెప్పి వెళ్ళిపోయాడు. అతని స్థానంలో మనోజ్‌ పరమహంస వచ్చి చేరాడు. తమిళ్‌లో బీస్ట్‌’, ‘లియో’ వంటి భారీ సినిమాలు ఎన్నో చేసిన ఎక్స్‌పీరియన్స్‌ మనోజ్‌కి ఉంది. తెలుగులో నాగచైతన్య, సమంత జంటగా గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో రూపొందిన సూపర్‌హిట్‌ మూవీ ‘ఏ మాయ చేసావె’ చిత్రానికి అద్భుతమైన విజువల్స్‌ అందించాడు మనోజ్‌. ఆ తర్వాత రేసుగుర్రం, కిక్‌-2, బ్రూస్‌లీ, రాధేశ్యామ్‌ లాంటి భారీ సినిమాలకు వర్క్‌ చేశాడు. ఒకరు పనిచేసి వదిలేసిన సినిమాను చేసేందుకు మనోజ్‌ ఒప్పుకోవడం అందర్నీ షాక్‌కి గురిచేసింది. మనోజ్‌ ఈ ప్రాజెక్ట్‌లోకి రావడంలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ చొరవ ఉందని తెలుస్తోంది.

ఈ ప్రాజెక్ట్‌లోకి తను రావడానికి ముఖ్య కారణం తమన్‌ అని ఒక ఇంటర్వ్యూలో మనోజ్‌ పరమహంస చెప్పాడు. చాలా కాలం నుంచి తామిద్దరం కలిసి వర్క్‌ చేస్తున్నామని చెప్పాడు. ‘లియో’ చిత్రం చివరి స్టేజ్‌లో ఉన్నప్పుడు తమన్‌ ‘గుంటూరు కారం’ గురించి చెప్పాడని, అప్పటికే తాను నిఖిల్‌ సినిమా ‘స్వయంభూ’ చిత్రం కమిట్‌ అయి ఉన్నానని చెప్పాడు. అయితే ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్‌కి ఇంకా టైమ్‌ పడుతుందని తెలిసి ఆ నిర్మాతను మేం ఒప్పించుకుంటాం అని చెప్పి తనను ‘గుంటూరు కారం’ ప్రాజెక్ట్‌లోకి తీసుకొచ్చాడని మనోజ్‌ చెప్పాడు.

‘గుంటూరు కారం’ చిత్రానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్‌ చేసుకున్నాడు మనోజ్‌. మహేష్‌ వంటి స్టార్‌ హీరోతో పనిచేయడం గొప్ప అనుభూతిని కలిగిస్తోందన్నాడు. సినిమాటోగ్రఫీలో భాగమైన లైటింగ్‌, యాంగిల్స్‌, ఫ్రేమింగ్‌ వంటి అన్ని విషయాల్లో మహేష్‌కి ఉన్న క్లారిటీ చూసి తాను ఆశ్చర్యపోయానని చెప్పాడు మనోజ్‌. ఈ విషయంలో ఇంత క్లారిటీ ఉన్న హీరోను తాను ఎప్పుడూ చూడలేదని అన్నాడు. ఈ సినిమాకి సంబంధించిన మార్పుల పరంపరలో తమన్‌ పేరు కూడా వినిపించింది. అయితే అతను ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోకపోగా, మనోజ్‌ పరమహంస వంటి గ్రేట్‌ టాలెంటెడ్‌ సినిమాటోగ్రాఫర్‌ని ఈ ప్రాజెక్ట్‌కి సెట్‌ చేసిన ఘనత మాత్రం తమన్‌కే దక్కింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.