English | Telugu
ప్రముఖ నటి వరలక్ష్మి ఇంట్లో విషాదం
Updated : Oct 27, 2023
తెలుగులో వచ్చిన నిర్మల ఆంటీ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన నటి బాబిలోనా. తెలుగు కుటుంబానికి చెందిన బాబిలోనా అసలుపేరు వరలక్ష్మి. చెన్నై లో స్థిరపడిన ఆమె శాస్త్ర, ఇష్క్ కా ఆచార్, లెవెల్ క్రాస్, తరలం, అనాగరిగం,అందాల పాప లాంటి చిత్రాల్లో బోల్డ్ గా నటించి ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. తాజాగా ఆమె ఇంట్లో జరిగిన ఒక విషాద సంఘటన సంచలనం అయ్యింది.
బాబిలోనా కి ఒక తమ్ముడు ఉన్నాడు. అతని పేరు విగ్నేష్. విగ్నేష్ ది మొదటి నుంచి క్రిమినల్ మైండ్. చెన్నైలోని కొన్ని ఏరియాల పోలీస్ స్టేషన్లలో అతని మీద కేసులు కూడా ఉన్నాయి. అలాగే ఎన్నో సార్లు మద్యం సేవించి పోలీసులకి పట్టుబడ్డాడు. చాలా సంవత్సరాల నుంచి విగ్నేష్ చెన్నైలోని సాలిగ్రామం దశరథ అపార్ట్ మెంట్ లో ఒంటరిగా ఉంటున్నాడు. ఏమైందో తెలియదు కానీ విగ్నేష్ తన అపార్ట్ మెంట్ లో విగతజీవిగా పడి ఉన్నాడు. అతని స్నేహితుడి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విగ్నేష్ తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇకపోతే బాబిలోనా ప్రముఖ వ్యాపారవేత్త సుందర్ బాబుల్ రాజుని 2015 లో వివాహం చేసుకొని సినిమాలకి స్వస్తి చెప్పింది.