English | Telugu
'గుంటూరు కారం' లేటెస్ట్ అప్డేట్.. మహేష్ ఫ్యాన్స్ కి పండగే!
Updated : Nov 15, 2023
'అతడు', 'ఖలేజా' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'గుంటూరు కారం'. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ధమ్ మసాలా సాంగ్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాని 2024 సంక్రాంతికి విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే మొదట్లో షూటింగ్ ఆలస్యమవ్వడం, ఇప్పుడు విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో.. నిజంగా 'గుంటూరు కారం' పొంగల్ కి వస్తుందా అనే అనుమానం కొందరిలో ఉంది.
గుంటూరు కారం సంక్రాంతికి విడుదల కావడంలో ఎలాంటి సందేహం లేదని, ఖచ్చితంగా విడుదలవుతుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇప్పటికే టాకీ పార్టు షూటింగ్ దాదాపు పూర్తయిందట. ఇంకా వారం రోజుల టాకీ షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉందని, అలాగే నాలుగు పాటల చిత్రీకరణ మిగిలి ఉందని తెలుస్తోంది. డిసెంబర్ మూడో వారానికి మొత్తం షూటింగ్ పూర్తి చేసి, గుమ్మడికాయ కొట్టనున్నారట. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయట. కాబట్టి గుంటూరు కారం సంక్రాంతి విడుదల విషయంలో ఎలాంటి సందేహం లేదు అంటున్నారు.
ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు.