English | Telugu

మంచు లక్ష్మీ ప్రసన్న చిత్రం "గుండెల్లో గోదారి"

మంచు లక్ష్మీ ప్రసన్న ప్రథాన పాత్రలో నటిస్తూండగా నిర్మించబోతున్న చిత్రం "గుండెల్లో గోదారి".ఈ "గుండెల్లో గోదారి" పేరులోనే నావెల్టీ ఉందనీ, ఈ చిత్రంలో మంచు లక్ష్మీ ప్రసన్న పాత్రలో ఇంకెంత నావెల్టీ ఉండబోతుందో అని ఫిలిం నగర్ జనాలంటున్నారు. ఇంతకు ముందు మంచు లక్ష్మీ ప్రసన్న హాలీవుడ్ లో ప్రముఖ హాలీవుడ్ హీరో సిల్వస్టర్ స్టాలోన్ తో కలసి ఒక టి.వి.షో చేశారు. తెలుగులో తొలిసారిగా "అనగనగా ఓ ధీరుడు" చిత్రంలో ఐరేంద్రి అనే నెగెటీవ్ పాత్రలో నటించి ప్రేక్షకుల మెప్పునూ, సినీ విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది.


అనంతరం రామ్ గోపాల వర్మ ప్రయోగాత్మకంగా కేవలం అయిదు రోజుల్లో నిర్మించిన ప్రయోగాత్మక చిత్రం "దొంగల ముఠా"లో శివ అనే స్పెషల్‍ బ్రాంచ్ ఇనస్పెక్టర్ గా మంచు లక్ష్మీ ప్రసన్న నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం "గుండెల్లో గోదారి" అనే చిత్రంలో మంచు లక్ష్మీ ప్రసన్న ఇంకెంత పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటారో వేచి చూడాలి. ఈ చిత్రానికి సంబంధిమచిన మిగిలిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.