English | Telugu

రెండు భాగాలుగా మహేష్, మణిరత్నం సినిమా

రెండు భాగాలుగా మహేష్, మణిరత్నం సినిమా తీయనున్నారని సమాచారం. వివరాల్లోకి వెళితే మహేష్ బాబు హీరోగా, మణిరత్నం దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మించనున్న చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మించనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. తమిళంలో వ్రాయబడిన "పొన్నియన్ సెల్వన్" అనే చారిత్రాత్మక నవలకు దృశ్యరూపంగా ఈ చిత్రం నిర్మించబడుతోంది.ఈ చిత్రంలో మహేష్ బాబు చోళరాజుగా నటిస్తూండగా, మరో హీరో విక్రమ్ పల్లవరాజుగా నటిస్తూండగా, విజయ్, ఆర్య, అనుష్క ముఖ్యపాత్రల్లో నటిస్తూండగా మణిరత్నం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.


ఈ చిత్రానికి మొత్తం రెండు వందల కోట్ల అత్యంత భారీ బడ్జెట్ ఖర్చుచేయనున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మిస్తూండగా, మొదటి భాగం ఎక్కడ ముగుస్తుందో అక్కడే రెండవ భాగం మొదలవుతుందట. ఈ చిత్రం మొదటి భాగానికి వంద కోట్లు, రెండవ భాగానికి వంద కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారట. ఈ చిత్రానికి పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తూండగా, ఎ.ఆర్. రెహమాన్ సంగీతాన్నందిస్తున్నారు. ఈ చిత్రానికి గాను మహేష్ బాబు పన్నెండు కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకుంటున్నారని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.