English | Telugu

గుణ‌శేఖ‌ర్ స్పైసీ చూపించాడు

రుద్ర‌మ‌దేవి అంటే క‌త్తియుద్దాలూ, గుర్ర‌పుస్వారీలూ, రాజ‌కీయాలూ, రాజ‌సౌథంలో స‌మావేశాలూ అనుకొంటారేమో..?? ఈ సినిమాలో స్పైసీ కూడా ఉంది చూడండి అంటున్నారు గుణ‌శేఖ‌ర్‌. రుద్ర‌మ‌దేవికి సంబంధించిన ఓ స్టిల్ ఇప్పుడు నెట్ ప్ర‌పంచంలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అనుష్క, నిత్య‌మీన‌న్, కేథ‌రిన్‌ల ఓ స్టిల్ టూ గ్లామ‌ర‌స్‌గా క‌నిపిస్తోంది. ఆ మాత్రం ఉండాలి మ‌రి. ఈ సినిమాలో ఒక‌రా ఇద్ద‌రా, న‌లుగురు హీరోయిన్లున్నారు. అనుష్క‌, నిత్య‌, కేథ‌రిన్ ల‌తో పాటు హంసానందిని కూడా న‌టించింది. న‌లుగురు హీరోయిన్ల‌తో ఆ మాత్రం గ్లామ‌ర్ పండించ‌క‌పోతే ఎలా? రుద్ర‌మ‌దేవిగా అనుష్క పాత్ర రెండు కోణాల్లో సాగుతుంది. ఒక‌టి యువ‌రాణి రుద్ర‌మ‌గా, రెండోది వీర‌నారి రుద్ర‌మ‌దేవిగా. యువ‌రాణి పాత్ర‌ని గుణ‌శేఖ‌ర్ అత్యంత గ్లామ‌రస్ గా తీర్చిదిద్దాడ‌ట‌. ఇది వ‌ర‌కు అనుష్క‌ని ఎవ్వ‌రూ చూపించ‌ని విధంగా ఆ పాత్ర‌ని మ‌లిచాడ‌ట‌. రుద్ర‌మ‌దేవి లాంటి సినిమాల్లోనూ గ్లామ‌ర్ కావాలా?? అంటారా. ఇది సినిమా అండీ. సినిమా అంటేనే గ్లామ‌ర్ ప్ర‌పంచం. అయితే ఆ గ్లామ‌ర్, స్పైసీ శ్రుతిమించ‌కుండా చూసుకోవాల్సిన బాధ్య‌త మాత్రం గుణశేఖ‌ర్‌దే. కొల‌త‌ల్లో ఏమాత్రం తేడా వ‌చ్చినా రుద్ర‌మ‌దేవితో అపఖ్యాతి మూట‌గ‌ట్టుకోవ‌డం ఖాయం.