English | Telugu

మెగా హీరోకి గోపిచంద్ సపోర్ట్

సాయిధ‌ర్మ‌తేజ్‌, రెజినా జంట‌గా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు నిర్మాత‌గా రూపోందిన చిత్రం 'సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్' ఈనెల 24న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈచిత్రం పై ఇప్ప‌టికే పాజిటివ్ టాక్ వుండ‌టం విశేషం. ఈచిత్రం త‌ప్ప‌కుండా పెద్ద విజ‌యాన్ని సాధిస్తుంద‌ని చిత్ర యూనిట్ తో పాటు మెగా అభిమానులు కూడా న‌మ్మ‌కంతో వున్నారు. సాయిధ‌ర్మతేజ్‌ మెద‌టి చిత్ర ద‌ర్శ‌కుడు ర‌వికుమార్ చౌద‌రి, హీరో గోపిచంద్ కాంబినేష‌న్ లో చేస్తున్న‌చిత్ర షూటింగ్‌ అన్న‌పూర్ణ స్టూడియోలో జ‌రుగుతుండ‌గా సాయిధ‌ర్మ‌తేజ్ షూటింగ్ లోకేష‌న్ కి వెళ్ళారు. వెంట‌నే హీరో గోపిచంద్‌, ద‌ర్శ‌కుడు ర‌వికుమార్ చౌద‌రి సాయి ధ‌ర్మ‌తేజ్ ని ప‌ల‌క‌రించి త‌ను నంటించిన 'సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్' పెద్ద విజ‌యాన్ని సాధించాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకున్నారు. 'సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్' చిత్ర యూనిట్ మెత్తానికి బెస్ట్ విషెస్ తెలిపారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.