English | Telugu
గోపాల గోపాల టికెట్లకు భారీ డిమాండ్
Updated : Jan 9, 2015
పవన్ కళ్యాణ్ క్రేజుకు తాజా ఉదాహరణ గోపాల గోపాల. సాధారణంగా ఏదైనా సినిమా విడుదల తేదీని పదిహేను రోజుల ముందు ఖరారు చేసి ఎంతో ప్రమోట్ చేస్తే గానీ హౌస్ ఫుల్ అవడం కష్టం. అలాంటిది పవన్ సినిమా కేవలం 40 గంటల ముందు రిలీజ్ ఖరారు చేస్తే బుకింగ్ ఓపెన్ చేసిన కేవలం గంట లోపు టిక్కెట్లన్నీ సోల్డ్ అవుట్. ఆన్ లైన్ బుకింగులతో పాటు ఇప్పటికే ఓపెన్ చేసిన అన్ని అడ్వాన్స్ బుకింగ్ లు అన్నీ అయిపోయాయి. ఇక బెనిఫిట్ షో టిక్కెట్లను ఎంత ఖరీదు పెట్టిన ఎగబడి కొంటున్నారు. మొత్తానికి గోపాల హంగామా మొదలైపోయింది.