English | Telugu
విషమంగా ఘంటసాల మొదటి భార్య ఆరోగ్యం!
Updated : Nov 20, 2023
దిగ్గజ సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు సతీమణి సావిత్రి(92) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. చెన్నైలోని నుంగంబాక్కంలో కుమార్తె నివాసంలో ఉంటున్న సావిత్రి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం ఆమె ఆరోగ్యం విషమించడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా ఘంటసాలకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య సావిత్రి, రెండో భార్య సరళా దేవి. ఘంటసాల-సావిత్రి దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు.