English | Telugu

రివ్యూ: మాస్‌ని అలరించే ‘గంగ’

రాఘవ (లారెన్స్‌) పడిపోయిన తమ ఛానల్‌ టీఆర్పీ రేటింగ్స్‌ పెంచడానికి ప్లాన్‌ చేసిన ఫేక్‌ హారర్‌ షోకి కెమెరామెన్‌గా వెళతాడు. ఆ షోకి డైరెక్టర్‌ నందిని (తాప్సీ). ఒక బీచ్‌ హౌస్‌లో ఈ షోని ప్లాన్‌ చేస్తారు. అయితే వారు ఊహించని విధంగా నిజంగానే కొన్ని ఆత్మలు వారిని వెంటాడడం మొదలవుతుంది. నందినిని ఒక ఆత్మ ఆవహించడంతో రాఘవ, అతని తల్లి (కోవై సరళ) ఇబ్బందుల్లో పడతారు. నందినిని ఆవహించిన ఆత్మ ఎవరిది, దాని కథేంటి?

కాంచన’ సీక్వెల్‌గా ‘గంగ’ నుంచి ఏమి ఆశిస్తామో అవన్నీ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా కామెడీని బాగా వాడుకుంటాడు లారెన్స్. హీరోనే అత్యంత పిరికివాడిగా చూపించడంలోనే అతడి కామెడీ రహస్యం దాగుంది. గంగలో ఈ క్యారెక్టర్‌ను మరింత బాగా వాడుకుని నవ్వులు పండించాడు. ప్రథమార్థంలో నవ్వులకు ఢోకా లేకుండా చూసుకున్న లారెన్స్.. ఇంటర్వెల్‌కు ముందు ఫియర్ ఫ్యాక్టర్ మీద దృష్టిపెట్టాడు. తాళితో ముడిపడిన సన్నివేశాలు..స్వామీజీ సీన్స్ ప్రేక్షకుల్ని థ్రిల్‌కు గురి చేస్తాయి. ఇంటర్వెల్‌కి ముందు ముప్పయ్‌ నిముషాలు సినిమాకి హైలైట్‌గా చెప్పుకోవాలి. మొత్తానికి ప్రథమార్ధంలో కామెడీకి తోడు, హార్రర్ కూడా పండటంతో ద్వితీయార్ధం మీద అంచనాలు పెరుగుతాయి.

ఐతే సెకండాఫ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం నిరాశ పరుస్తుంది. కోవై సరళతో చేసే బాదుడు కామెడీ బాగానే పేలింది కానీ.. ఆ తర్వాత సినిమా గాడి తప్పింది. లారెన్స్ దయ్యం అవతారాలు మార్చే పాటలో డోస్ కొంచెం ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. ముసలావిడగా.. చిన్నపాపగా.. లారెన్స్ అవతారాలు థ్రిల్ కలిగిస్తాయి. ఆ పాటలో లారెన్స్ డ్యాన్స్ మూమెంట్స్ కూడా అదరగొట్టాడు. ఐతే ఫ్లాష్ బ్యాక్‌ కొంచెం లెంగ్తీ అయిపోవడం.. వయొలెన్స్ మోతాదు పెరిగిపోవడం..గ్రాఫిక్స్ మోతాదు పెరిగిపోయి.. వీడియో గేమ్‌లాగా ఉండే క్లైమాక్స్ సినిమా గ్రాఫ్‌ను కొంచెం కిందికి దించాయి.

ఫ్లాష్ బ్యాక్‌లో నిత్యామీనన్ క్యారెక్టర్ జనాలకు షాకిస్తుంది. ఆమె నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తన పాత్రకు వంద శాతం న్యాయం చేసింది. తాప్సి దయ్యం పాత్రలో ఆశ్చర్యపరిచేలా నటించింది. నిత్యామీనన్ లాంటి నటిని కూడా డామినేట్ చేసేలా దయ్యం క్యారెక్టర్లో చెలరేగిపోయింది తాప్సి. లారెన్స్ తన టిపికల్ డైరెక్షన్‌తో ఆకట్టుకున్నాడు. విలన్‌ జయప్రకాష్‌తో పాటు కామెడీ రోల్స్‌లో కోవై సరళ, శ్రీమాన్‌, మనోబాల తమ పాత్రలకు న్యాయం చేశారు.

నలుగురు సంగీత దర్శకులు కలిసి అందించిన సంగీతం మాస్‌ను ఆకట్టుకునేలా ఉంది. నేపథ్య సంగీతం కొన్ని చోట్ల మరీ లౌడ్‌గా అనిపిస్తుంది. కెమెరా యాంగిల్స్‌ కొన్ని చోట్ల మరీ టూమచ్‌గా అనిపిస్తాయి. ఎడిటింగ్‌లో కొన్నిచోట్ల వేగం ఎక్కువైైంది. కొన్ని చోట్ల లాగ్ పెరిగింది. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు. అయితే ముందే చెప్పినట్టు ఈ చిత్రాన్ని మెచ్చే ప్రేక్షకులకి అలాంటి అంశాల గురించిన చింత ఉండదు. వారు ఎంటర్‌టైన్‌ అయినంత సేపు సినిమా క్వాలిటీ ఎంత, ఖర్చెంత, లొకేషన్స్‌ ఏంటి వగైరా వాటి గురించి అస్సలు ఆలోచించరు. కాంచన మాదిరిగానే ‘గంగ’ కూడా బాక్సాఫీస్‌ని ఒక ఊపు ఊపేసి పోతుందనిపిస్తుంది. సెకండాఫ్‌ని సరిగ్గా హ్యాండిల్‌ చేసినట్టయితే ఈ చిత్రానికి ఉన్న క్రేజ్‌కి సంచనలాలకి తెర తీసి ఉండేది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .