English | Telugu

నా లవ్‌ను కనుగొన్నాను.. వరుణ్‌తేజ్ ఆనందం!

ప్రేమికులు వరుణ్‌తేజ్ కొణిదెల, లావణ్యా త్రిపాఠి వివాహ నిశ్చితార్ధంతో ఒక్కటయ్యారు. శుక్రవారం రాత్రి నాగబాబు ఇంట్లో జరిగిన వేడుకలో ఆ ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. 2016లో 'మిస్టర్' సినిమాలో కలిసి నటించినప్పట్నుంచీ ఆ ఇద్దరి మధ్యా పెనవేసుకున్న ప్రేమబంధం అంతకంతకూ బలపడుతూ వచ్చింది. అయితే నిశ్చితార్ధం జరిగే వరకూ తమ మధ్య బంధాన్ని ఆ ఇద్దరూ బహిర్గతం చెయ్యలేదు.

కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఆ ఇద్దరూ ప్రేమలో ఉన్న విషయం కొద్దికాలం క్రితం బయటపడింది. అప్పట్నుంచీ వారు పెళ్లి చేసుకోనున్నారనే ప్రచారం జరుగుతూ వచ్చింది. మణికొండలోని నాగబాబు ఇంట్లో జరిగిన నిశ్చితార్ధానికి ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. వరుణ్‌తేజ్ నాయనమ్మ అంజనాదేవి, చిరంజీవి-సురేఖ దంపతులు, పవన్ కల్యాణ్, రాంచరన్-ఉపాసన దంపతులు, అల్లు అరవింద్ దంపతులు, అల్లు అర్జున్-స్నేహారెడ్డి దంపతులు, అల్లు బాబీ దంపతులు, అల్లు శిరీష్, సుశ్మిత దంపతులు, శ్రీజ, సాయిధరం తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ మేనత్తలు నిశ్చితార్ధానికి వచ్చి వరుణ్, లావణ్యలను ఆశీర్వదించారు.

ఎన్‌గేజ్‌మెంట్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను షేర్ చేసిన వరుణ్ తేజ్, "Found my Lav! @itsmelavanya (sic)." అని రాశాడు. అవే ఫోటోలను షేర్ చేసిన లావణ్య, "2016 Found my forever! @varunkonidela7" అని రాసింది.

తమ రెండో సినిమా 'అంతరిక్షం 9000 KMPH' చేసేటప్పుడు ఆ ఇద్ధరూ ప్రేమలో ఉన్నారనే విషయం యూనిట్ మెంబర్స్‌కు తెలిసింది. 2020లో వరుణ్ చెల్లెలు నిహారిక పెళ్లికి హాజరైన కొద్దిమంది సెలబ్రిటీలలో లావణ్య కూడా ఉంది. అది వరుణ్, లావణ్య మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందనే రూమర్స్‌కు బలం చేకూర్చింది.

సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం గత డిసెంబర్ 15న లావణ్య పుట్టినరోజుకు వరుణ్ పెళ్లి ప్రపోజల్ తెచ్చాడు. ఆ తర్వాత ఆ ఇద్దరూ తమ తల్లితండ్రులకు ఈ విషయం చెప్పి వారి అంగీకారం తీసుకున్నారు. అయితే నాగబాబు సైతం ఇంతదాకా ఎక్కడా ఈ విషయాన్ని బహిర్గతం చెయ్యలేదు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.