English | Telugu
అమెరికాలోని తెలుగువారి కోసం...
Updated : Sep 4, 2023
నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటిస్తున్న సినిమా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. అందులో భాగంగా నవీన్ పొలిశెట్టి తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాలు పర్యటిస్తున్నారు. ప్రేక్షకుల్ని కలుస్తున్నారు. అంతేకాదు త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్ కోసం అమెరికా వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో నవీన్ పాల్గొన్నారు. ఈ సినిమా షూటింగ్ కి చాలా టైమ్ తీసుకుందని, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా బాగా డిలే అయిందని చెప్పారు. దానికి అభిమానులు మన్నించాలని కోరారు. ప్రేక్షకులు తమపై చూపిస్తున్న అభిమానానికి, ప్రేమకి బదులుగా ఒక మంచి సినిమా ఇస్తున్నామని తెలిపారు. ఈ సినిమాను కుటుంబ సమేతంగా చూసి ఆనందించేలా రూపొందించామని చెప్పారు. ఈ సినిమా ప్రీమియర్ సెప్టెంబర్ 6న డల్లాస్ లో ప్రదర్శించనున్నారు. దీనికోసం నవీన్ వెళుతున్నారు. యు ఎస్ లోని తెలుగు వారితో కలిసి ఈ సినిమాను వీక్షించబోతున్నారు నవీన్. యు.ఎస్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. ఈ సినిమాలో నవీన్ స్టాండప్ కమెడియన్ గా, అనుష్క చెఫ్ గా కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మంచి ట్రెండింగ్ లో ఉంది.