English | Telugu
నాగ్ పాటకి.. అమల డాన్స్... వైరల్ అవుతున్న వీడియో
Updated : Sep 4, 2023
టాలీవుడ్ సహా పలు భాషల్లో హీరోయిన్ గా నటించి టాప్ హీరోలతో స్టెప్పులేసిన అమల చాలా గ్యాప్ తర్వాత మరోసారి తన డాన్స్ తో అలరించారు. అన్నపూర్ణ స్టూడియోకి చెందిన ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ నిర్వహించిన ఓ వేడుకలో అమల డాన్స్ చేశారు. హలో బ్రదర్ చిత్రంలోని ప్రియరాగాలే.. పాటకు తనదైన స్టయిల్ లో ఆమె నర్తించారు. నాగార్జునతో పలు చిత్రాల్లో నటించిన అమల అతనితో పెళ్ళి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పారు. చాలా గ్యాప్ తర్వాత 2012లో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి నటించిన మనం చిత్రంలోనూ కనిపించారు. మనం చిత్రం తర్వాత ఒకే ఒక జీవితం చిత్రంలో మదర్ క్యారెక్టర్ చేసి మెప్పించారు. తాజాగా స్టేజ్ మీద అమల చేసిన డాన్స్ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్కినేని ఫ్యాన్స్ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. అమల అంటే అక్కినేని ఫ్యాన్స్ కి ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. అందుకే చాలా గ్యాప్ తర్వాత ఆమె డాన్స్ చెయ్యడంతో ఆనందం తట్టుకోలేకపోతున్నారు. ఫ్యాన్స్. తమ అభిమాన నటి మళ్లీ నటిగా కొనసాగాలని కోరుకుంటున్నారు.