English | Telugu

అందర్నీ భయపెట్టడానికి వస్తున్న ఫైర్‌ బ్రాండ్‌!

హీరోయిన్‌ వరలక్ష్మి శరత్‌కుమార్‌ అంటే ఒక ఫైర్‌ బ్రాండ్‌ లాంటిది. పవర్‌ఫుల్‌ క్యారెక్టర్స్‌, నెగెటివ్‌ క్యారెక్టర్స్‌ చేయడంలో ఆమెకు ఆమే సాటి. హీరోకి ఏమాత్రం తగ్గకుండా ఉండే ఆమె పెర్‌ఫార్మెన్స్‌కి ఎంతో మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకున్న వరలక్ష్మీ ఇప్పుడు ఓ హారర్‌ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమా ఎవరిదైనా తన క్యారెక్టర్‌కి ఉన్న ఇంపార్టెన్స్‌ని బట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్ళే వరలక్ష్మీ ఇప్పుడు వెబ్‌ సిరీస్‌లో కూడా నటించడానికి ఓకే చెప్పింది.

తెలుగులో ‘రాజుగారి గది’ వంటి హారర్‌ మూవీని తెరకెక్కించిన ఓంకార్‌ డైరెక్షన్‌లో రూపొందుతున్న వెబ్‌ సిరీస్‌ ‘మ్యాన్షన్‌ 24’. ఒక మ్యాన్షన్‌కి వెళ్లిన కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు. అనుకోకుండా ఆ మ్యాన్షన్‌లోనే ఉండిపోవాల్సి వస్తుంది. అయితే వారు అందులో ఇరుక్కోవడానికి కారణం ఏమిటి? ఆ మ్యాన్షన్‌ నుంచి వారు బయటపడ్డారా? అనే ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన ఈ వెబ్‌ సిరీస్‌లో బిందుమాధవి, అవికా గోర్‌, అభినయ, సత్యరాజ్‌, రావు రమేశ్‌ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ వెబ్‌ సిరీస్‌ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవ్వనుంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.