English | Telugu
Bhagavanth Kesari : హిందీలో 'భగవంత్ కేసరి'.. బాలయ్య ఓన్ డబ్బింగ్!
Updated : Nov 10, 2023
నటసింహం నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'భగవంత్ కేసరి'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ నిర్మించిన ఈ యాక్షన్ డ్రామా దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలై.. మూడు వారాల్లో రూ.70 కోట్లకు పైగా షేర్ రాబట్టి ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. 'అఖండ', 'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వచ్చి, బాలయ్యకు హ్యాట్రిక్ విజయాన్ని అందించిన 'భగవంత్ కేసరి' త్వరలో హిందీలో విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా బాలకృష్ణ ప్రకటించారు.
"బాక్సాఫీస్ కా షేర్ సెలెబ్రేషన్స్" పేరుతో తాజాగా భగవంత్ కేసరి సక్సెస్ మీట్ ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. త్వరలో భగవంత్ కేసరి హిందీలో విడుదల కాబోతుందని చెప్పారు. తనకు ప్రయోగాలు చేయడం ముందు నుంచి అలవాటని, అందులో భాగంగానే ఈ సినిమా కోసం మొట్టమొదటిసారి డబ్బింగ్ చెప్పానని తెలిపారు. ఈ సినిమా మన భాషా పటిమ ఏంటో, మన తెలుగువారి సత్తా ఏంటో తెలియచేస్తుందని బాలకృష్ణ అన్నారు.
తెలుగునాట ఘన విజయం సాధించిన 'భగవంత్ కేసరి' హిందీలో కూడా ఆస్థాయి ఆదరణకు నోచుకుంటుందేమో చూడాలి.