English | Telugu

నాగపుర్ లోనాగార్జున, అఖిల్

నాగార్జున, అఖిల్ నాగపుర్ కి వెళ్ళారట. అదీ మార్చ్ 12 వ తేదీ ఉదయానికి నాగార్జున, అఖిల్ నాగపూర్ కి వెళ్ళారు. నాగపుర్ లోనాగార్జున, అఖిల్ కి ఏం పని...? షూటింగ్ పని మీద వెళ్ళారా...? కాదుగాక కాదు. కానే కాదు. మరెందుకు నాగార్జున, అఖిల్ నాగపుర్ కి వెళ్ళింది.ఈ ప్రశ్నకు సమాధానం నాగపూర్ లో వరల్డ్ కప్ లో భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగనున్న మ్యాచ్ ని చూడటానికి. నాగార్జున చిన్న కుమారుడు అఖల్ మంచి క్రికెటర్ అన్న విషయం స్టార్స్ క్రికెట్ మ్యాచ్ టాలీవుడ్ ట్రోఫీలో ఆడినప్పుడే తెలిసింది.

నాగార్జున చిన్న కుమారుడు అఖల్ కి క్రికెట్ అంటే ప్రాణమనీ, అతని ఆరాధ్య క్రికెటర్ సచిన్ టెండుల్కరని వేరే చెప్పక్కరలేదు కదా. భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఉండే కిక్కే వేరు. అది గాక తన అభిమాన క్రికెటర్ సచిన్ ని కూడా కలవచ్చన్న కోరికతో కూడా తండ్రి నాగార్జునను తీసుకుని అఖిల్ నాగపూర్ కి వెళ్ళాడు. భవిష్యత్తులో అఖిల్ మంచి క్రికెటర్ అవుతాడని ఆశిద్దాం.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.