English | Telugu

మిస్టర్ పెర్ ఫెక్ట్ సాంగ్స్ లీక్

మిస్టర్ పెర్ ఫెక్ట్ సాంగ్స్ లీకయ్యాయి. "మిస్టర్ పెర్ ఫెక్ట్" మూవీలోని మూడు సాంగ్స్ ఇంటర్నెట్ లో లీకయ్యాయి. మిస్టర్ పెర్ ఫెక్ట్ చిత్రంలోని మూడు సాంగ్స్ యు ట్యూబ్‍ లో లీకయ్యాయి. మిస్టర్ పెర్ ఫెక్ట్ సాంగ్స్ ఎలా లీకయ్యాయో, ఎవరి ద్వారా లీకయ్యాయో తెలియదు. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం ఈ మిస్టర్ పెర్ ఫెక్ట్ సాంగ్స్ ని పబ్లిసిటీలో భాగంగా ఈ చిత్ర నిర్మాత దిల్ రాజే కావాలని ఇంటర్నెట్ లో లీక్ చేసి ఉంటారని అంటున్నారు. అయినా తెలుగు సినిమాని పైరసీ భూతం అనేక విధాలుగా నాశనం చేస్తోంది. కనుక ఇది దిల్ రాజు పని అనుకోవటం కూడా అనుమానించాలి.

ఎందుకంటే కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీసే ఏ నిర్మాత కోరి కోరి తన సినిమాలోని పాటలను ఇలా లీక్ చేయటానికి ఇష్టపడడు కదా. గతంలో కూడా ఇలా కొన్ని చిత్రాల్లోని సాంగ్స్ ఇలా ఇంటర్నెట్ లో లీకయ్యాయి. దేవీశ్రీ ప్రసాద్ ఈ మిస్టర్ పెర్ ఫెక్ట్ సాంగ్స్ ని చాలా బాగా ట్యూన్ చేశారనీ, అవి ఈ "మిస్టర్ పెర్ ఫెక్ట్" మూవీకి హిట్ కి బాగా ఉపయోగపడతాయనీ సినీ వర్గాలంటున్నాయి. ఈ "మిస్టర్ పెర్ ఫెక్ట్" మూవీలో హీరో ప్రభాస్ ని ఒక కొత్త లుక్ తో కనిపించేలా దర్శకుడు దశరథ్ చూపించారనీ తెలిసింది.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.