English | Telugu
ప్రివ్యూ చూపెట్టు ... హిట్టు చేపట్టు
Updated : Jul 10, 2014
సినిమా వాళ్లు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా విడుదలకు ముందు నిర్మాతలు, దర్శకులు, ముఖ్య తారాగణం తెగ టెన్షన్ పడుతుంటారు. కలెక్షన్లతో పాటు టాక్ ఎలా వుంటుంది అనే విషయంలో కూడా ఈ టెన్షన్ కొనసాగుతుంది. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు కూడా 50 రోజులు ఆడే పరిస్థితి లేని ఈ రోజుల్లో నిర్మాతలు తమ సినిమాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని గోప్యంగా వుంచుతున్నారు. సినిమా నిర్మాణ దశలో ఉన్నప్పుడు మధ్య మధ్యలో ప్రముఖులకు, సీనియర్లకు తమ సినిమా గురించి చెప్పటం, లేదా కొంత భాగాన్ని చూపించి సలహాలు తీసుకోవడానికి కూడా ఆలోచిస్తున్నారు సినిమా రూపకర్తలు. ఇక మీడియాతో సినిమా గురించి అంశాలు ఆచితూచి షేర్ చేసుకుంటున్నారు ఫిలిం మేకర్స్.
ఈ దశలో టాలీవుడ్ మరిచిపోయిన ఒక పాత విధానానికి ‘మనం’ సినిమా తిరగదోడింది. విడుదలకు ముందే సినీ ప్రముఖులకు, మీడియా కోసం ప్రీవ్యూ ఏర్పాటు చేసి వారి రెస్పాన్స్ తెలుసుకునే పద్ధతి మళ్లీ ముందుకొచ్చింది. దృశ్యం సినిమాకు కూడా ప్రీవ్యూ ఏర్పాటు చేశారు. శుక్రవారం విడుదల కానున్న ఈ చిత్రానికి రెండు రోజుల ముందుగానే ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
సినిమా పై ఎంతో నమ్మకం వుంటే గాని ఈ పని ఈ రోజుల్లో చేయటం కష్టం అనే చెయ్యాలి. అదృష్ట వశాత్తు అలా ప్రీవ్యూ చేసిన మనం, దృశ్యం రెండు చిత్రాలకు రెస్పాన్స్ పాజిటివ్ గానే వచ్చింది. విడుదల అనంతరం పబ్లిక్ రెస్పాన్స్ వేచి చూడాల్సింది.