English | Telugu

రామ్ చరణ్ ప్లేసులో హృతిక్ రోషన్


‘జంజీర్’ చేస్తున్న సమయంలో రామ్ చరణ్ కు బాలీవుడ్ లో మరో సినిమా అవకాశం కూడా వచ్చిందని వార్తలు వచ్చాయి. జోధాఅక్బర్ సినిమా దర్శకుడు అశుతోష్ గోవారీకర్ ఆ ఆఫర్ ఇచ్చారని అప్పట్లో మీడియాలో కథనాలు వెలువడ్డాయి. చరణ్ కూడా ఈ సినిమా గురించి అవును, కాదు అంటూ సూటి సమాధానాలు ఏవీ ఇవ్వలేదు. మగధీరా తరహాలో భారీ బడ్జెట్ తో ఆ సినిమా రూపొందుతుందని బాలీవుడ్‌లో చెప్పుకున్నారు. మెగాహీరోకి మరో బాలీవుడ్ మెగా ఆఫర్ వచ్చిందని అభిమానులు గంతులు వేశారు.


ఆ తర్వాత చెర్రీ తన తర్వాత ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేస్తు వున్నారు. ఈ గ్యాప్ లో ఆ సినిమా సంగతి అందరూ మరిచిపోయిరు. ఇప్పుడూ అశుతోష్ తన కొత్త సినిమా వివరాలు బయట పెట్టడంతో ఈ విషయం మళ్లీ టాలీవుడ్ లో చర్చకు వచ్చింది. అనుకున్నట్లుగానే అశుతోష్ ఒక భారీ బడ్జెట్ చిత్రాన్ని రూపొందించెందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ చిత్రంలో హీరోగా హృతిక్ నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆయన 50 కోట్ల రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నారని అక్కడి మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో జంజీర్ తర్వాత రామ్ చరణ్ బాలీవుడ్‌లో మళ్లీ ఎప్పుడు నటిస్తారనేది ప్రశ్నగానే మారిందని చెప్పాలి.


పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.