English | Telugu

ఆర్జీవి ‘వ్యూహం’కు షాక్‌.. నవంబర్‌ 10 రిలీజ్‌ లేనట్టే?

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ.. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఎవరు ఏ కామెంట్‌ చేసినా, ఎవరు ఎలా అతన్ని ట్రోల్‌ చేసినా ఏ చలనం లేని దర్శకుడుగా మారిపోయాడన్నది అందరి అభిప్రాయం. ఒకప్పుడు ఎవ్వరూ టచ్‌ చేయడానికి కూడా సాహసించని సబ్జెక్ట్స్‌తో సినిమాలు చేసి సంచలన విజయాలు అందుకున్న మాట వాస్తవమే. ఒకప్పుడు రామ్‌గోపాల్‌వర్మ మకాం ముంబాయి. ఎప్పుడో ఒకసారి హైదరాబాద్‌ వచ్చేవాడు. అది మీడియాకు ఒక సెలబ్రేషన్‌లా ఉండేది. లోకల్‌ మీడియా నుంచి నేషనల్‌ మీడియా వరకు అందరూ ఎగబడి వచ్చేవారు. వర్మ ఏం చెబుతాడా అని శ్రద్ధగా వినేవారు. కానీ, ఇప్పుడా పరిస్థితి ఉందా? అంటే ముమ్మాటికీ లేదనే చెప్పాలి.

ఒక గొప్ప స్టేజ్‌ నుంచి అందరే చీదరించుకునే స్టేజ్‌కి వచ్చాడంటే అది స్వయంకృతాపరాధమే. ఒకప్పుడు డైరెక్టర్‌ అంటే రామ్‌గోపాల్‌వర్మ తర్వాతే ఎవరైనా అనే స్థాయి నుంచి దిగజారిపోయి సి గ్రేడ్‌, డి గ్రేడ్‌... ఇలా ఒక్కో మెట్టూ దిగుతూ సినిమా చేసి తనకున్న పేరును తనే నాశనం చేసుకున్నాడు. ఇప్పుడు పొలిటికల్‌ మూవీస్‌ చేస్తూరాజకీయ నాయకులు కూడా తిట్టుకునే స్థాయికి వచ్చాడు.

తాజాగా ‘వ్యూహం’ పేరుతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి? వై.ఎస్‌.జగన్‌ ముఖ్యమంత్రి అవడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి? వంటి అంశాలతో ‘వ్యూహం’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ముందే అంటే నవంబర్‌ 10న రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేశారు. అయితే సెన్సార్‌ బోర్డ్‌ ‘వ్యూహం’ టీమ్‌కి, రామ్‌గోపాల్‌వర్మకు షాక్‌ ఇచ్చింది. ఈ సినిమాకు ఎట్టి పరిస్థితుల్లోనూ సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. సినిమాలోని పాత్రలకు నిజజీవితంలోని వ్యక్తుల పేర్లను పెట్టడంపై సెన్సార్‌బోర్డ్‌ అభ్యంతరం తెలిపింది. అలాగే ప్రస్తుతం రాజకీయంగా జరుగుతున్న పరిణామాలనే కథగా తీసుకోవడంపై అసహనం వ్యక్తం చేసింది. దీంతో ‘వ్యూహం’ నవంబర్‌ 10కి రిలీజ్‌ లేదని, కొందరు అసలు ‘వ్యూహం’ రిలీజే లేదని ఊహాగానాలు చేస్తున్నారు.

‘వ్యూహం’ సినిమాకి సంబంధించి సెన్సార్‌ ఎలాంటి అభ్యంతరాలు చెప్పింది, అధికారికంగా చిత్ర యూనిట్‌కి అందిన సమాచారం ఏమిటి? అనేది వివరించేందుకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ తమకు సెన్సార్‌ బోర్డు నుంచి వచ్చిన లెటర్‌లో ఒకే ఒక వాక్యం ఉందని, అది ‘ఈ సినిమాను రివైజింగ్‌ కమిటీకి రిఫర్‌ చేస్తున్నాం’ అని మాత్రమేనని వర్మ చెప్పారు. రివైజింగ్‌ కమిటీ సినిమాను ఎప్పుడు చూస్తుంది అనేది తెలియదని, కాబట్టి నవంబర్‌ 10న రిలీజ్‌ చెయ్యాలనుకున్న సినిమాను వాయిదా వేస్తున్నామని తెలిపారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.