English | Telugu

సీక్వెల్స్‌నే నమ్ముకుంటున్న డైరెక్టర్లు.. కారణమేంటి?

ఈమధ్యకాలంలో సీక్వెల్స్‌ చేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది. కొంతమంది డైరెక్టర్లు కొత్త కథల అన్వేషణ మానేసి సక్సెస్‌ అయిన సినిమాలకు సీక్వెల్స్‌ చేయడంలోనే ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. దానికి కారణం కొత్త కథలైతే అవి ఎంత వరకు వర్కవుట్‌ అవుతాయి? కమర్షియల్‌గా ఎంతవరకు గిట్టుబాటు అవుతుందనే ఆలోచన వారిని సీక్వెల్స్‌ వైపే మొగ్గు చూపేలా చేస్తున్నాయి.

ఇటీవలికాలంలో దృశ్యం సిరీస్‌, సింగం సిరీస్‌, చంద్రముఖి సిరీస్‌ దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మలయాళంలో జీతు జోసెఫ్‌ ‘దృశ్యం’తో మొదలుపెట్టి ఆ తర్వాత ‘దృశ్యం2’ని కూడా తెరకెక్కించాడు. ఈ సినిమా మలయాళంతోపాటు తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో కూడా రూపొంది ఘనవిజయం సాధించింది. ఇప్పుడు జీతు ‘దృశ్యం3’ కథను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. మొదట వచ్చిన రెండు భాగాలకు భిన్నంగా మరింత కొత్తగా ఈ కథను రెడీ చేస్తున్నారని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

ఇక సూర్యతో ‘సింగం’ సిరీస్‌ను చేసి ఘన విజయాలు సాధించిన దర్శకుడు హరి. పూర్తి యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌తో ఎంతో వేగవంతమైన స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుల్ని కట్టిపడేయడంలో హరి సిద్ధహస్తుడు. ఇప్పుడు అదే ఫార్ములాతో ‘సింగం4’ను రెడీ చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. హీరో సూర్యకు ఈ సిరీస్‌ ఎంతో పేరు తెచ్చింది. మరోసారి హరితో కలిసి సింగం సిరీస్‌కు వర్క్‌ చేసేందుకు సూర్య కూడా ఉత్సాహంగా ఉన్నట్టు తెలుస్తోంది.

హారర్‌ సినిమాలకు కొత్త దారి చూపిన దర్శకుడు పి.వాసు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో ‘చంద్రముఖి’ చిత్రాన్ని చేసి సంచలన విజయం అందుకున్న పి.వాసు ఇప్పుడు ‘చంద్రముఖి 2’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘చంద్రముఖి 2’లో లారెన్స్‌తో పాటు సంచలన నటి కంగనా రనౌత్‌ను కూడా జోడిరచి మరో అద్భుతాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకి సంబంధించిన ఫంక్షన్‌లో ‘చంద్రముఖి3’ కూడా ఉంటుందని ప్రకటించడంతో మరో సంచలనానికి శ్రీకారం చుట్టబోతున్నారని అర్థమవుతోంది. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మొత్తానికి సీక్వెల్స్‌ బాగా వర్కవుట్‌ అవుతున్న నేపథ్యంలో ఈ దర్శకులు ఆ కథల్లోనే కొత్తదనాన్ని చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మెయిన్‌ కథలోని ఫ్లేవర్‌ ఎక్కడా చెడకుండా దానికి కొత్త కథను జోడిరచి ప్రేక్షకుల్ని మెప్పించే పనిలో పడ్డారు. మరి ఈ కొత్త సీక్వెల్స్‌ ఎంతవరకు వర్కవుట్‌ అవుతాయో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.