English | Telugu

వారు నన్ను పావుగా వాడాలనుకుంటున్నారు.. పూనమ్ సంచలన లేఖ!

ప్రముఖ నటి పూనమ్ కౌర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని, ఆమె ఓ ప్రముఖ పార్టీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన పూనమ్ ఆ వార్తల్లో నిజం లేదని తేల్చారు. కొందరు రాజకీయ నాయకులు వారి ప్రయోజనాల కోసం తనను ఓ పావుగా వాడాలనుకుంటున్నారని, దయచేసి రాజకీయాలలోకి తనను లాగొద్దని, తన సేవ కార్యక్రమాలు తనను చేసుకోనివ్వాలని కోరుతూ ఈ మేరకు పూనమ్ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

"ఇప్పటివరకు నేను ఏ రాజకీయ పార్టీ కండువా కప్పుకోలేదు. ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాను. సమస్య ఆధారంగానే నేను స్పందిస్తుంటాను. ఈ మధ్య కొందరు రాజకీయ నాయకులు వారి ప్రయోజనాల కోసం నన్ను ఓ పావుగా వాడాలనుకుంటున్నారు. ఇది సముచితం కాదు. గత ఎన్నికలలో కూడా ఇలాంటి వికృత చేష్టలు చేశారు. మరికొందరు పైశాచిక ఆనందం పొందాలనుకుంటున్నారు. ఒక మహిళపై ఇలాంటి కుట్రలు తగవు. మరికొందరు నాయకులు సానుభూతి పేరుతో నాకు, నా కుటుంబ సభ్యులకు ఫోన్లు చేస్తున్నారు. నేను సిక్కుబిడ్డను. మాకు త్యాగాలు తెలుసు. పోరాటాలు తెలుసు. దయచేసి నన్ను మీ రాజకీయాల కోసం నన్ను లాగొద్దు.

ప్రస్తుతం నేను చేనేత కళాకారుల కోసం పనిచేస్తున్నాను. గత రెండు సంవత్సరాలుగా వారి కోసం జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త యర్రమాద వెంకన్న నేత గారితో కలిసి దేశవ్యాప్త పర్యటన చేస్తున్నాను. ఇప్పటికే 15 రాష్ట్రాలు, 21 రాజకీయ పార్టీలకు సంబంధించిన 100కు పైగా పార్లమెంటు సభ్యులను కలిసి వారి మద్దతు తీసుకున్నాము. ఈ ప్రయాణంలో అనేకమంది సామాజిక ఉద్యమకారులను కలిసాము. మహిళా ఉద్యమ నేతలతో చర్చించాము. మహిళా హక్కుల కోసం నిరంతరం నేను గళం విప్పుతూనే ఉంటాను. చేనేత మరియు మహిళా ఉద్యమాలను జాతీయస్థాయిలో నిర్మించే క్రమంలో ఉన్నాము. నా వైపు నుండి ఏదైనా అప్డేట్ ఉంటే నేనే స్వయంగా తెలియజేస్తాను. దయచేసి దీనిని గమనించగలరని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను." అని పూనమ్ కౌర్ ప్రకటనలో పేర్కొన్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.