English | Telugu

రాజకీయాల్లోకి దిల్ రాజు?

సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్లడం సహజం. ఇటీవల ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే దిల్ రాజు మాత్రం రాజకీయాలు తన వల్ల కాదని అంటున్నారు.

దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ లో రూపొందిన 'బలగం' సినిమా మార్చి 3న థియేటర్లలో విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఓటీటీలోనూ విశేష ఆదరణ పొందుతున్న ఈ చిత్రాన్ని.. కొన్ని గ్రామాల్లో ప్రత్యేక షోలు వేసుకొని మరీ అందరూ కలిసి చూస్తున్నారు. 'బలగం' సినిమా ప్రేక్షకులకు ఇంతలా చేరువ అవ్వడంతో.. తాజాగా మూవీ టీమ్ తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన దిల్ రాజు తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన ప్రశ్న ఎదురైంది.

"రాజకీయాల్లోకి రమ్మని నన్ను అడుగుతున్నారు. అయితే వెళ్లాలా వద్దా అనేది ఇంకా నాకే క్లారిటీ లేదు. సినీ పరిశ్రమలో నాపై విమర్శలు వస్తేనే తట్టుకోలేను. రాజకీయాల్లోకి వెళ్లాలంటే మెంటల్ గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. అది నా వల్ల కాకపోవచ్చు. దీనిలోనే మీకు కావాల్సిన సమాధానం ఉంది" అంటూ దిల్ రాజు తనదైన శైలిలో పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.