English | Telugu

ఆ ఓటమి నా గుండెను చీల్చింది - ధనుష్


జర్మనీ చేతిలో బ్రెజిల్ ఓటమి నా గుండెను ముక్కలు చేసింది అంటూ బాధ పడ్డారు హీరో ధనుష్. ఫుట్‌బాల్ ప్రేమికులెంతో మంది ఫిఫా వరల్డ్ కప్-2014లో బ్రెజిల్ ఓటమి చూసి తీవ్ర వ్యథకు గురయ్యారు. అందులో తమిళ హీరో ధనుష్ కూడా చేరారు. బ్రెజిల్ ఓటమి నా చూసి నా గుండె పగిలింది అంటూ ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆ మ్యాచ్ చూసి చాలా బాధ కలిగిందని, హృదయం ముక్కలయ్యేందని తన బాధను పంచుకున్నారు. బ్రెజిల్ ఓడిపోయినా తాను బ్రెజిల్ అభిమానిగానే వుంటానని పేర్కొన్నారు. మంగళవారం జరిగిన మ్యాచ్ లో బ్రెజిల్ జర్మనీ చేతులో 7-1 తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. తాను నటించిన చిత్రాలు అపజయం పాలైనప్పుడు కూడా ధనుష్ ఈ విధంగా స్పందించక పోయి వుండవచ్చు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.