English | Telugu

'సలార్'లో డివోషనల్ టచ్!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'సలార్'. 'బాహుబలి', 'కేజీఎఫ్' స్థాయిలో ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంటుందని ప్రభాస్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఈ క్రేజీ మూవీ గురించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన న్యూస్ చక్కర్లు కొడుతోంది.

ఇప్పటికే విడుదలైన 'సలార్' పోస్టర్స్ ని బట్టి చూస్తే ఇది కూడా 'కేజీఎఫ్' తరహా భారీ యాక్షన్ ఫిల్మ్ అని చెప్పేయొచ్చు. అయితే ఈ సినిమాలో డివోషనల్ టచ్ కూడా ఉంటుందని న్యూస్ వినిపిస్తోంది. ఇందులో కాళీ మాత ప్రస్తావన ఉంటుందని ప్రచారం జరుగుతోంది. నార్త్ లో యాక్షన్ ఫిలిమ్స్ తో పాటు డివోషనల్ టచ్ ఉన్న సినిమాలకు ఆదరణ ఎక్కువ ఉంటుంది. ఆ పరంగా చూస్తే యాక్షన్, డివోషనల్ కలగలిసిన 'సలార్'కి భారీ ఆదరణ లభిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అంటే సౌత్ లో ఏ రేంజ్ లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అలాగే ఈ చిత్రాన్ని 'బాహుబలి', 'కేజీఎఫ్' తరహాలో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 28, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది.