English | Telugu

ఎర్రబస్సు స్పీడు ఎంత?

ఎర్రబస్సు దర్శకరత్న దాసరి నారాయణ రావు గారి లేటెస్ట్ సినిమా. విష్ణు హీరోగా దాసరి నటిస్తూ, దర్శకత్వం వహించిన ‘ఎర్రబస్సు’ విడుదలకు సిద్ధమయ్యింది. తమిళంలో విజయవంతమైన ‘మంజ పయ్‌’ చిత్రానికి రీమేక్‌ ఇది. శుక్రవారం విడుదలవుతోన్న ఈ చిత్రానికి పబ్లిసిటీ ఘనంగానే చేస్తున్నారు. ఈ సినిమాకి బిజినెస్‌ ఆఫర్స్‌ వస్తున్నా సినిమాపై నమ్మకంతో సొంతంగా రిలీజ్ చేస్తున్నానని దాసరి చెబుతున్నారు. తాత, మనవడి మధ్య అనుబంధాలు, ఆప్యాయతల్ని సినిమాలో అద్భుతంగా చూపించామంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా హిట్ సినిమాలు తీయలేక ఇబ్బంది పడుతోన్న దాసరి 'ఎర్రబస్సు' తో సడన్ గా ఫామ్ లోకి వస్తారా? వస్తే దాసరి ఎర్రబస్సు స్పీడ్ ఏ స్థాయిలో వుంటుంది? తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.