English | Telugu

మెగా హీరో రాహుకేతు పూజలు

మెగా క్యాంప్ నుంచి ‘గౌరవం’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ కి టైమ్ అంతగా కలిసి రావడం లేదు. మొదటి సినిమాతో మెగా అభిమానులను ఆకట్టుకోలేకపోయిన అల్లు శిరీష్, రెండో సినిమా కొత్త జంటలో కూడా నిరాశపరిచాడు. ఆ సినిమాకు హీరో కంటే హీరోయిన్ కే ఎక్కువ పేరు వచ్చింది. అలాగే ఆ సినిమాలో శిరీష్ లేకుంటే మంచి ఫలితం వచ్చేదన్న విమర్శలు కూడా వచ్చాయి. దీంతో హిట్ కోసం దోష నివారణ పూజలో నిమగ్నమయ్యాడు మెగా హీరో. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం ఉదయం శిరీష్, తన ఫ్రెండ్‌తో కలిసి రాహుకేతు పూజలు నిర్వహించాడు. ఈ సందర్భంగా పూజ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న మీడియాపై ఈ హీరో అసహనం వ్యక్తంచేశాడని సమాచారం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.