English | Telugu

"డేంజర్ పిల్ల" ప్రోమో వచ్చేసింది.. హేరిస్ జైరాజ్ అన్న మళ్ళీ దిగిండు!

హేరిస్ జైరాజ్.. ఒకప్పుడు ఈ పేరే ఒక బ్రాండ్. మ్యూజిక్ లవర్స్ ని కొన్నేళ్ళ పాటు మైమరిపించిన హేరిస్.. ఈ మధ్య ఎందుకనో కాస్త స్లో అయిపోయాడు. మరీముఖ్యంగా.. తెలుగునాట తన పాట ముచ్చట వినిపించి చాలా కాలమే అయింది. చివరిసారిగా 'స్పైడర్' (2017)తో సందడి చేసిన మిస్టర్ జైరాజ్.. దాదాపు ఆరేళ్ళ విరామం అనంతరం మరో టాలీవుడ్ ప్రాజెక్ట్ తో పలకరించబోతున్నాడు. ఆ చిత్రమే.. 'ఎక్స్ ట్రా'. ఆర్డినరి మ్యాన్ అనే ట్యాగ్ తో వస్తున్న ఈ సినిమాలో యూత్ స్టార్ నితిన్ హీరోగా నటిస్తుండగా.. క్రేజీ బ్యూటీ శ్రీలీల హీరోయిన్. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'తో దర్శకుడైన ప్రముఖ రచయిత వక్కంతం వంశీ ఈ సినిమా కోసం మరోమారు మెగాఫోన్ పట్టాడు. నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది.

ఇదిలా ఉంటే, 'ఎక్స్ ట్రా'కి సంబంధించిన ఫస్ట్ సింగిల్ "డేంజర్ పిల్ల"ని ఆగస్టు 2న రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో భాగంగానే సోమవారం ఈ పాట తాలూకు ప్రోమోని యూట్యూబ్ ముంగిట నిలిపారు. పాటైతే మరీ గొప్పగా లేదు.. అలాగని చప్పగా లేదు. హేరిస్ జైరాజ్ మార్క్ ట్యూనే అయినా.. లిరిక్స్ అంతగా మ్యాచ్ కాలేదనిపించింది. పూర్తి పాట వింటే గానీ ఓ క్లారిటీ రాదు కాబట్టి.. ఆగస్టు 2 వరకు వేచి చూడాల్సిందే. ఇక ఈ ప్రోమో చూసి హేరిస్ జైరాజ్ అభిమానులు 'అన్న మళ్ళీ దిగిండు' అంటూ సంబరపడిపోతున్నారు. మరి.. ఇప్పటివరకు తెలుగులో ఒక్క సాలిడ్ హిట్ లేని హేరిస్ జైరాజ్.. ఈ సారైనా ఆ ముచ్చట తీర్చుకుంటాడేమో చూడాలి.కాగా, 'ఎక్స్ ట్రా' క్రిస్మస్ స్సెషల్ గా డిసెంబర్ 23న జనం ముందుకు రానుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.