English | Telugu
డాకు మహారాజ్ ఓటిటి డేట్ ఇదేనా!
Updated : Jan 29, 2025
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Balakrishna)సంక్రాంతి కానుకగా ఈ నెల 12 న 'డాకు మహారాజ్'(Daku Maharaj)గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న ఈ మూవీలో మూడు విభిన్నమైన క్యారెక్టర్స్ లలో బాలకృష్ణ ప్రదర్శించిన నటనకి అభిమానులే కాకుండా ప్రేక్షకులు కూడా మెస్మరైజ్ అయ్యారు.
ఈ మూవీ ఓటిటి హక్కులని నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే.రిలీజ్ రోజు టైటిల్స్ లోనే ఈ విషయాన్నీ ప్రకటించడం జరిగింది.25 కోట్లకి నెట్ ఫ్లిక్స్ దక్కించుకుందనే టాక్ కూడా సినీ
ట్రేడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతు ఉంది. ఇక డాకు మహారాజ్ ఓటిటి లో ఎప్పుడు స్ట్రీమింగ్ కి వస్తుందనే చర్చ ఫిలిం సర్కిల్స్ లో మొదలయ్యింది.ఈ మేరకు ఫిబ్రవరి 9 న రిలీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందనే న్యూస్ కూడా వినపడుతుంది.
చిత్ర బృందం గాని,నెట్ ఫ్లిక్స్ సంస్థ గాని,ఇప్పటి వరకు ఓటిటి డేట్ ని అధికారకంగా ప్రకటించలేదు.మూవీ కి అయితే ఇప్పటికి అన్ని ఏరియాల్లో కలెక్షన్స్ బాగానే ఉన్నాయి.దీంతో ఓటిటి రిలీజ్ మరింత లేట్ అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని కూడా కొంత మంది వ్యక్తం చేస్తన్నారు.
బాలకృష్ణ సరసన ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా చెయ్యగా,శ్రద్దశ్రీనాధ్,ఊర్వశి రౌతేలా,బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించారు.సితార ఎంటర్ టైన్మేంట్ పై నాగవంశీ(Naga Vamshi)నిర్మించగా బాబీ(Bobby)దర్శకత్వం వహించాడు.థమన్ సంగీత దర్శకుడు.