English | Telugu

జూనియర్ ఎన్టీఆర్ ను కలిపించండి.. నా కూతురి చివరి కోరిక నెరవేర్చండి...

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కు ఎందరో అభిమానులు ఉన్నారు. అనారోగ్యం కారణంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న అభిమానులు సైతం తమ చివరి కోరిక ఎన్టీఆర్ ను కలవడం అని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గతంలో అలా ప్రాణాపాయ స్థితిలో ఉన్న అభిమానులను కొందరిని కలిశాడు ఎన్టీఆర్. తాజాగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఒక యువతి ఎన్టీఆర్ ను కలిసి మాట్లాడాలని ఆశ పడుతుంది.

తెలంగాణలోని హుజూరాబాద్ కి చెందిన స్వాతి(25) బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతోంది. తన అభిమాన హీరో ఎన్టీఆర్ ను కలిసి మాట్లాడటం తన చివరి కోరిక. ఈ విషయాన్ని స్వాతి తల్లి రజిత తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు కోమటిరెడ్డికి రజిత ఒక లేఖ రాశారు. "నా కూతురు స్వాతి బ్లడ్ క్యాన్సర్ పేషంట్. జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి మాట్లాడాలనేది ఆమె చివరి కోరిక. కాబట్టి తమరు దయవుంచి ఎన్టీఆర్ ను కలిపించాల్సిందిగా కోరుతున్నాను." అని రజిత లేఖలో పేర్కొన్నారు. మరి ఈ విషయం ఎన్టీఆర్ దృష్టికి వెళ్లి, ఆయన స్వాతి చివరి కోరికను నెరవేరుస్తారేమో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.