English | Telugu

'మా' ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో నెల‌కొన్స స‌స్పెన్స్‌కు తెర‌ప‌డింది. మా అధ్య‌క్ష ఎన్నికలు యధాతథంగా నిర్వహించుకోవచ్చునని శుక్రవారం సాయంత్రం సిటీ సివిల్‌ కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఆదివారం (29వ తేదీన‌) మా అసోసియేషన్‌ ఎన్నికలు జరగనున్నాయి. మా ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అధ్య‌క్ష స్థానానికి పోటీచేస్తున్నరాజేంద్రప్రసాద్‌ ప్యానల్‌కు చెందిన కళ్యాణ్‌ సిటీ సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ ఫిర్యాదుపై శుక్రవారం కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఈ ఎన్నికలు నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతున్నాయని, ఎన్నికలను నిలిపివేయాలని కోరారు. ఫీజులు విపరీతంగా పెంచారని వైస్‌ ప్రెసిడెంట్‌కు రూ. 2 వేల నుంచి రూ. 5 వేలకు పెంచారని, అధ్యక్షుడుగా పోటీ చేసేవారికి రూ. 10 వేలుకు పెంచారని… ఇది మా ఎన్నికల నిబంధ‌న‌ల‌కు విరుద్ధమని వారి త‌ర‌ఫు న్యాయవాది పేర్కొన్నారు. అలాగే మురళీమోహన్‌, ఆలీ తరఫు న్యాయవాది కూడా తమ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ఎన్నికల నిర్వ‌హ‌ణ‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కోర్టు ఆమోదం తర్వాతే ఫలితాలు ప్రకటించాలని షరతు విధించింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఇప్పటికే వేడెక్కిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అధ్యక్ష పదవికి రాజేంద్ర ప్రసాద్, జయసుధ పోటీ చేస్తున్నారు. వారి ప్యానల్ తరపున ఇతర పదవులకు బరిలో నిలిపారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.