English | Telugu
ధన్‌రాజ్ యాక్షన్‌లో సముద్ర ఖని!
Updated : Oct 10, 2023
స్టార్ కమెడియన్స్ అందరూ హీరోలుగా మెప్పించాలని ప్రయత్నాలు చేసిన వారే. కొందరు టెంపరరీగా సక్సెస్ అయినా ఎక్కువ కాలం మాత్రం హీరోలుగా కొనసాగలేకపోయారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. కమెడియన్స్ కొందరూ మెగాఫోన్స్ పడుతున్నారు. దర్శకులుగా తమ ప్రతిభను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత ఏడాది బలగం సినిమాను వేణు ఎల్దండి డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ కమెడియన్ బాటలో మరో కమెడియన్, నటుడు అడుగు పెడుతున్నారు. త్వరలోనే ఆయన దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభం కానుంది. ఇంతకీ డైరెక్టర్‌గా మారతున్న ఆ నటుడు ఎవరు? అందులో హీరో ఎవరు? అనే వివరాల్లోకి వెళితే..
కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ దర్శకుడు దిల్ రాజు తన వారసులు హర్షిత్, హన్షితలతో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌ను స్టార్ట్ చేసి బలగం సినిమాను నిర్మించారు. అప్పటి వరకు పలు సినిమాల్లోకమెడియన్‌గా మెప్పించిన వేణు ఎల్దండి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఆయనే కథ రాసుకుని తెరకెక్కించారు. మినిమం బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించటంతో పాటు ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులను గెలుచుకుంది. ఇప్పుడు వేణు బాటలోకి కమెడియన్ ధన్‌రాజ్ కూడా అడుగు పెట్టారు. ఆయన మెగా ఫోన్ పట్టనున్నారు.
ధన్‌రాజ్ తెరకెక్కించనున్న చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 నిర్మించనుంది. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ సినిమాలో తమిళ విలక్షణ నటుడు సముద్ర ఖని ఇందులో ప్రధాన పాత్రలో నటించబోతున్నారు. ప్రస్తుతం ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన రానుందని సినీ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి వేణు ఎల్దండి స్టైల్లోనే ధన్‌రాజ్ సక్సెస్ అవుతారో లేదో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.