English | Telugu

కలెక్షన్ కింగ్ సంచలన వ్యాఖ్యలు

కలెక్షన్ కింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే అలనాటి మేటి నటుడు స్వర్గీయ పద్మశ్రీ చిత్తూరు.వి.నాగయ్య గారి పేరు మీద ఇచ్చే చిత్తూరు నాగయ్య స్మారక అవార్డు ఫంక్షన్ ఇటీవల చెన్నైలో జరిగింది. కలెక్షన్ కింగ్, పద్మశ్రీ, డాక్టర్ మోహన్ బాబుకీ, సీనియర్ నటి అంజలీ దేవికీ ఈ అవార్డులు లభించాయి. ఈ సందర్భంగా మోహన్ బాబు ప్రసంగిస్తూ " నాకు గవర్నమెంటు ఇచ్చే అవార్డుల మీద సదభిప్రాయం లేదు. లాబీయింగ్ చేస్తేనో, రికమెండేషన్ ఉంటేనో, డబ్బిలిస్తేనో అవి వస్తాయని గతంలో చెప్పానూ, ఇప్పటికీ అదే చెపుతాను. నేను ఏనాడూ ఎవర్నీ రికమెండ్ చేయమని అడగలేదు. అమ్మ (అంజలీదేవి)కు పద్మశ్రీ కాదు...ఆమె తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను "పద్మవిభూషణ్" అవార్డునివ్వాలి" అని అన్నారు.

అంజలీ దేవికి శాలువాకప్పి ఆమెకు పాద నమస్కారం చేసి, సీనియర్ నటీ, నటులకు తాను ఎంతగౌరవం ఇస్తారో, ప్రపంచానికి చెప్పకనే చెప్పారు కలేక్షన్ కింగ్ మోహన్ బాబు. ఇది ఇప్పుడున్న నేటి తరం నటీనటుల్లో ఎంతమంది అలా తమ సీనియర్లను గౌరవించగలిగే సంస్కారవంతులున్నారు చెప్పండి......

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.