English | Telugu

రానా నా ఇష్టం మలేసియా స్కెడ్యూల్ పూర్తి

రానా "నా ఇష్టం" మలేసియా స్కెడ్యూల్ పూర్తి చేసుకుంది. వివరాల్లోకి వెళితే యునైటెడ్ మూవీస్ పతాకంపై, యువ హీరో రానా హీరోగా, హాసిని పాప జెనీలియా డిసౌజా హీరోయిన్ గా, ప్రకాష్ తోలేటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, డైనమిక్‍ యువ నిర్మాత పరుచూరి కిరీటి నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం"నా ఇష్టం". రానా "నా ఇష్టం" మలేసియా 48 రోజుల భారీ స్కెడ్యూల్ ప్లాన్ చేసింది. ఆ స్కెడ్యూల్ ప్రస్తుతం పూర్తయింది. మలేసియాలో రానా "నా ఇష్టం" సినిమాకి సంబంధించిన యాక్షన్ సీన్లను స్టన్ శివ, మలేసియా ఫైట్ మాస్టర్ రజబ్ కంపోజ్ చేయగా చిత్రీకరించారు.

అలాగే హీరో రానా, హీరోయిన్ జెనీలియాలపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను కూడా అక్కడ చిత్రీకరించారు. ఈ విషయాలను తన ట్విట్టర్ లో రానా " మలేసియాలో 48 రోజుల స్కెడ్యూల్ పూర్తయింది.అక్కడి డటూరిజం శాఖ, పోలీసు శాఖ అందించిన సహకారానికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అక్కడి మేనేజర్ శ్రీనివాస్ కీ, అక్కడి ఆనంద్ సినీ సర్వీస్ బోయ్స్ కీ నా థ్యాంక్స్. సూపర్బ్ వర్క్ బోయ్స్" అంటూ వ్రాశారు. రానా "నా ఇష్టం" సినిమాకి వెంకట్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.