English | Telugu

యన్ టి ఆర్ ఊసరవెల్లి సినిమా ప్రోగ్రెస్

యన్ టి ఆర్ "ఊసరవెల్లి" సినిమా ప్రోగ్రెస్ ఎంతవరకూ వచ్చింది అన్న వివరాలిలా ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై, యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, "కిక్" ఫేం సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో, బి.వి.యస్.యన్.ప్రసాద్ నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "ఊసరవెల్లి". యన్ టి ఆర్ "ఊసరవెల్లి" సినిమా ప్రోగ్రెస్ ఎంతవరకూ వచ్చిందంటే హైదరాబాద్ పఠాన్ చెరువు లోని విజయఎలక్ట్రికల్స్ లో వచ్చేవారం రోజుల వరకూ షూటింగ్ జరుపుకుంటుంది.

ఆ తర్వాత జూలై 23 నుండి జూలై 30 వరకూ ముంబాయిలో ఈ యన్ టి ఆర్ "ఊసరవెల్లి" సినిమా షూటింగ్ జరుగుతుందని విశ్వస నీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. గతంలో యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా, సమీరా రెడ్డి హీరోయిన్ గా, సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో "అశోక్" అనే చిత్రం వచ్చింది. కానీ ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఘనవిజయం సాధించలేదు. ఈ యన్ టి ఆర్ "ఊసరవెల్లి" సినిమాని సూపర్ హిట్ చేయాలనే పట్టుదలతో దర్శకుడు సురేంద్ర రెడ్డి ఉన్నట్లు సమాచారం.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.