English | Telugu

'బేబీ' క్లైమాక్స్ మార్చమని చెప్పిన మెగాస్టార్!

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బేబీ'. మాస్ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకుడు. జూలై 14న విడుదలైన ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, దాదాపు రూ.40 కోట్ల షేర్ రాబట్టి సంచలన విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా చూశాక క్లైమాక్స్ మరోలా తీసి ఉంటే బాగుండేదని దర్శకుడు సాయి రాజేష్ తో మెగాస్టార్ చిరంజీవి అన్నారట. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి రివీల్ చేయడం విశేషం.

మెగా కల్ట్ సెలబ్రేషన్స్‌ పేరుతో తాజాగా 'బేబీ' సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరయ్యారు. తన అభిమానులైన సాయి రాజేష్, ఎస్.కె.ఎన్ తన స్ఫూర్తితో సినీ పరిశ్రమకు వచ్చి, ఇప్పుడు బేబీ లాంటి చిత్రం తీయడం గర్వంగా ఉందని అన్నారు. ఈ సినిమా తనకు ఎంతగానో నచ్చిందని, అయితే క్లైమాక్స్ లో చిన్న మార్పు చేస్తే బాగుండేదని దర్శకుడికి సూచించినట్లు చెప్పారు.

"సినిమా చివర్లో హీరోయిన్ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టు దర్శకుడు చూపించాడు. ఇలా చూపించడం వల్ల ఎన్ని తప్పులు చేసినా సరే.. ఎవడో ఒకడు దొరుకుతాడని వాడితో సెటిల్ కావచ్చనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుందేమో అనిపించింది. అందుకే హీరోయిన్ మరో వ్యక్తిని పెళ్లి చేసుకోకుండా నన్ గా మారి సేవ చేస్తున్నట్లు చూపిస్తే బాగుండేదని సలహా ఇచ్చాను. అయితే తర్వాత దీని గురించి ఆలోచిస్తే, దర్శకుడే కరెక్ట్, నేనే తప్పు అనిపించింది. ఎందుకంటే, తెలిసో తెలియకో తప్పు చేస్తే లైఫ్ అయిపోయినట్టు కాదని, లైఫ్ మళ్లీ చిగురిస్తుందనే మెసేజ్ ను ఈ సినిమా ద్వారా ఇచ్చారు." అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .