English | Telugu

త్రిషకి అండగా చిరంజీవి

కొన్ని రోజుల క్రితం ప్రముఖ సినీ నటి త్రిష పై మరొక సినీ నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు భారతీయ చిత్ర పరిశ్రమలో పెను సంచలనం సృష్టించాయి. చాలా మంది సినిమా ప్రముఖులు, మేధావులు అలీఖాన్ ని తిడుతూ త్రిషకి మద్దతుగా మాట్లాడుతున్నారు.తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా త్రిషకి మద్దతుగా నిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

చిరంజీవి తన సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా మన్సూర్ అలీఖాన్ పై తీవ్రంగా విరుచుకుపడ్డాడు.త్రిషపై మన్సూర్ చేసిన వ్యాఖ్యలు కేవలం త్రిష ఒక్కదానిపైనే కాకుండా అందరి ఆడవాళ్ళ గురించి అలా మాట్లాడినట్టుగా ఉన్నాయని అన్నాడు.ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని అసలు క్షమించకూడదని మన్సూర్ వక్రబుద్ధితో వీర్రవీగుతున్నాడని అనడానికి ఆ వ్యాఖ్యలే ఒక ఉదాహరణ అని అన్నాడు. త్రిష విషయంలో చిరంజీవి స్పందించిన తీరు పట్ల పలువురు చిరంజీవిని అభినందిస్తున్నారు

లియో సినిమాలో లోకేష్ కనగరాజ్ తనని తీసుకున్నప్పుడు త్రిషకి నాకు బెడ్ రూమ్ సీన్స్ పెడతాడేమో అని అనుకున్నాను. అప్పుడు త్రిషని నా చేతులతో ఎత్తుకొని బెడ్ రూమ్ కి తీసుకెళ్తానని అనుకున్నాను కనీసం త్రిషతో రేపు సీన్ అయిన ఉంటుంది అనుకుంటే అది లేదు అని చాలా అసభ్యకరమైన పదజాలాలతో త్రిషపై మన్సూర్ మాట్లాడాడు. కాగా త్రిష చిరంజీవితో కలిసి స్టాలిన్ అనే సినిమా చేసింది.