English | Telugu
రష్మితో సుధీర్ పెళ్లి.. క్లారిటీ వచ్చేసింది!
Updated : Nov 21, 2023
బుల్లితెరపై బెస్ట్ ఆన్ స్క్రీన్ జోడి అనగానే గుర్తుకొచ్చే పేర్లు సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్. ఈ ఇద్దరు కలిసి ఎన్నో టీవీ షోలు, ఈవెంట్ లు చేశారు. ఈ ఆన్ స్క్రీన్ జోడికి ఎందరో అభిమానులున్నారు. వీరు ప్రేమలో ఉన్నారని, ఎప్పటికైనా పెళ్ళి చేసుకుంటారని భావించేవాళ్ళు కూడా ఉన్నారు. తమ ప్రేమకథ ఆన్ స్క్రీన్ కే పరిమితమని ఇప్పటికే సుధీర్, రష్మి పలు సందర్భాల్లో చెప్పారు. అయినప్పటికీ వీరి ప్రేమ, పెళ్ళి గురించి వార్తలు వస్తూనే ఉంటాయి. తాజాగా రష్మితో పెళ్ళిపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు సుధీర్.
వెండితెరపై కూడా సుధీర్ హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'గాలోడు' వంటి సినిమాలతో అలరించిన సుధీర్.. ఈ డిసెంబర్ 1 'కాలింగ్ సహస్ర' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుక జరగగా.. మీడియా నుంచి సుధీర్ కి పెళ్ళికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది.
"మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకోబోతున్నారు? మీ పెళ్ళి రష్మి గారితోనే జరుగనుందా?" అనే ప్రశ్నకు సుధీర్ బదులిస్తూ "మాది ఆన్ స్క్రీన్ వరకే అని ఇప్పటికే పలుసార్లు చెప్పాను. అయినప్పటికీ మళ్ళీ అడుగుతున్నారంటే మా జోడీని అంతలా ఓన్ చేసుకున్నారు అందరూ. అది స్క్రీన్ వరకే. ఇక పెళ్ళి గురించి ఇప్పటికైతే ఎలాంటి ఆలోచన లేదు. ప్రస్తుతం కెరీర్, ఫ్యామిలీ గురించే ఆలోచిస్తున్నాను. దేవుడు ఏమైనా ఇటు వైపు తోసేస్తే పెళ్ళి మీదకు మనసు మళ్లుతుందేమో చూడాలి." అన్నాడు.