English | Telugu

ప్రభాస్ కి చిరంజీవి బర్త్ డే విషెస్ చెప్పినట్టుగా ఇండియాలో ఎవరు చెప్పరేమో 

ఈ రోజు రెబల్ స్టార్ ప్రభాస్(prabhas)పుట్టినరోజు.ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులే కాకుండా వరల్డ్ వైడ్ గా ఉన్న అభిమానులు ప్రభాస్ పుట్టిన రోజు వేడుకని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.ఇక సినిమా పరిశ్రమకి సంబంధించిన హీరోలందరూ కూడా ప్రభాస్ కి బర్త్ డే విషెస్ చెప్తున్నారు.

రీసెంట్ గా మెగాస్టార్ తన ట్విట్టర్ వేదికగా 'ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్. అతను ప్రేమించే పద్దతి చూసి, తిరిగి అమితంగా ప్రేమించేస్తాం.హ్యాపీ బర్త్ డే డార్లింగ్ ప్రభాస్. విషింగ్ యు లవ్. రాబోయే సంవత్సరం నీకు చాలా అద్భుతమైన సంవత్సరంగా ఉండాలి. ఆనందం మరియు గొప్ప కీర్తి నీకు ఇస్తుందంటూ ట్వీట్ చేసాడు.

చిరంజీవి(chiranjeevi)ప్రభాస్ కి మధ్య మొదట నుంచి కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.ఒకే ఇంట్లోని కుటుంబసభ్యుల్లా మెలిగే ఆ ఇద్దరు ఒకే విలేజ్ నుంచి సినిమాల్లోకి వచ్చి నేడు భారతీయ చిత్ర పరిశ్రమని శాసించే స్థాయికి ఎదిగారు.చాలా సందర్భాల్లో నాకు ఇన్ స్పిరేషన్ చిరంజీవి అని ప్రభాస్ చెప్పాడు.