English | Telugu
విజయ్‌ని ఢీ కొట్టబోతున్న విక్రమ్!
Updated : Aug 21, 2023
తమిళనాడులో ఇప్పుడు దళపతి విజయ్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘లియో’. తెలుగు, తమిళ భాషల్లో భారీ లెవల్లో విడుదలకు సన్నద్ధమవుతుంది. తమిళంలో ఎలాగూ విజయ్‌కు ఉండే క్రేజ్ వేరు. అయితే తెలుగులో ఇప్పుడాయన మార్కెట్ సినిమా సినిమాకు పెరుగుతుంది. అందులో భాగంగా ‘లియో’ సినిమా తెలుగు రైట్స్‌ను మన నిర్మాతలు ఫ్యాన్సీ ఆఫర్‌కు సొంతం చేసుకున్నారు. ఇక దసరా బరిలోకి లియోతో పాటు నందమూరి బాలకృష్ణ హీరోగా చేసిన భగవంత్ కేసరి, మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
తమిళనాడులో అయితే విజయ్‌కి పోటీగా మరో పెద్ద హీరో రావటం లేదని నిన్న, మొన్నటి వరకుఅందరూ భావించారు. అయితే తాజాగా కోలీవుడ్ వెర్సటైల్ హీరో చియాన్ విక్రమ్ ధ్రువ నక్షత్రం సినిమా దసరాకు రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. చియాన్ విక్రమ్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ క్రేజ్ ఉంది. అదీగాక ఆ సినిమాకు గౌతమ్ మీనన్ దర్శకుడు. కచ్చితంగా సినిమాపై అంచనాలు ఏర్పడుతాయనటంలో సందేహామే అక్కర్లేదు. అంటే ఈసారి దళపతి విజయ్‌కి అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ చియాన్ విక్రమ్ రూపంలో పోటీ ఎదురు కానుంది.
త్వరలోనే ధ్రువ నక్షత్రం సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించిన మేకర్స్ అధికారిక ప్రకటన రానుందని టాక్. ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్. ఐశ్వర్యా రాజేష్ కీలక పాత్రలో నటించినప్పటికీ ఎడిటింగ్‌లో ఆమె పాత్రను లేపేశారు మరి.