English | Telugu
ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం రామ్ చరణ్
Updated : Mar 9, 2011
ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం రామ్ చరణ్ ఆర్ టి ఎ (రోడ్ ట్రాన్స్ పోర్ట్ అధారిటీ) ఆఫీసుకి వెళ్ళాడట. విషయానికొస్తే యువ హీరో మెగాస్టార్ నట వారసుడు "మగధీర" వంటి ఆల్ టైమ్ హిట్టిచ్చిన యువ హీరో రామ్ చరణ్ తేజకు ఇంతర్ నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ లేదట.
ఆ లైసెన్స్ కోసం రామ్ చరణ్ హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ఆర్ టి ఎ ఆఫీసుకి వెళ్ళాడట. అక్కడ రామ్ చరణ్ ని గుర్తు పట్టిన అభిమానులు వెంటనే ఆటోగ్రాఫ్ లు, ఫొటోలంటూ రామ్ చరణ్ వెంటపడ్డారట. అందరినీ ఆప్యాయంగా పలకరించిన రామ్ చరణ్ ఆర్ టి ఎ ఆఫీసులోకి వెళ్ళారు.
అక్కడ తన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తిచేసి, తన ఇంటికి తిరిగి వెళ్ళినట్లు సమాచారం. తాను ఎంతపెద్ద హీరో కొడుకునైనా, ఎంత పెద్ద యువ హీరో అయినా చట్టం ముందు అందరిలా తాను కూడా సామాన్యుడనేనని, అందుకే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం తాను కూడా ఆర్ టి ఎ (రోడ్ ట్రాన్స్ పోర్ట్ అధారిటీ) ఆఫీసుకి వెళ్ళానని రామ్ చరణ్ ఈ సంఘటన ద్వారా తెలియజేశాడు.