English | Telugu

రాజమౌళి "ఈగ" తమిళ్ కు రచయితగా క్రేజీ మోహన్

రాజమౌళి "ఈగ" తమిళ్ కు రచయితగా క్రేజీ మోహన్ రచయితగా పనిచేస్తున్నారు. విషయానికొస్తే రాజమౌళి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మించబడుతున్న గ్రాఫిక్ మాయాజాలం "ఈగ"చిత్రం తమిళ వెర్షన్ డైలాగులను క్రేజీ మోహన్ వ్రాస్తున్నారు. తమిళంలో క్రేజీ మోహన్ ప్రముఖ రచయిత. క్రేజీ మోహన్ తమిళంలో సూపర్ హిట్‍ చిత్రాలకు మాటలు వ్రాశారు.


రాజమౌళి అనుకున్న భావాలను క్రేజీ మోహన్ సరిగ్గా తమిళ భాషలో ప్రతఫలించేలా మాటలను వ్రాస్తున్నారట. ఈ "ఈగ" చిత్రం తమిళ హక్కులను 5 కోట్లకు అమ్మటం విశేషం. రాజమౌళి "ఈగ" చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తీస్తున్నారు. రాజమౌళి "ఈగ" చిత్రంలో నాని, సమంత జంటగా, సుదీప్ విలన్ గా నటిస్తున్నారు. ఈ రాజమౌళి "ఈగ" చిత్రానికి సెంథిల్‍ కుమార్ కెమెరామేన్ గా పనిచేస్తున్నారు. రాజమౌళి "ఈగ" చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.