English | Telugu

సినీ వర్కర్స్ vs ప్రొడ్యూసర్స్.. చిరంజీవి ఎవరి వైపు..?

తెలుగు చిత్ర పరిశ్రమలో కొద్దిరోజులుగా సినీ కార్మికులు వర్సెస్ నిర్మాతలు అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కార్మికులు సమ్మెకు దిగారు. అయితే నిర్మాతలు మాత్రం ఇప్పటికే వేతనాలు ఎక్కువగా ఉన్నాయని, ప్రస్తుతం సినీ పరిశ్రమ పరిస్థితి కూడా బాలేదని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే సమస్య పరిష్కారమై, షూటింగ్ లు తిరిగి ప్రారంభం కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవితో ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ సమావేశమయ్యారు.

సినీ కార్మికుల సమ్మెపై చిరంజీవిని కలసి చర్చించిన సి. కళ్యాణ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. "ఈరోజు చిరంజీవి గారిని కలవడం జరిగింది. ఆయన ఈ సమస్య సాల్వ్ అవ్వాలని ప్రతిరోజు మాతో ఫాలోప్ చేస్తూనే ఉన్నారు. చిరంజీవి గారు పెద్ద మనిషిగా.. ఇరు వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఉన్నారు. తన వంతుగా కార్మికులతో మాట్లాడాతాను అన్నారు‌. రేపు ఫెడరేషన్ వారు చిరంజీవి గారిని కలవనున్నారు. సోమవారం లోగా సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాను." అన్నారు.

"నిర్మాతలు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ముఖ్యంగా చిన్న నిర్మాతలు బాగా సఫర్ అవుతున్నారు‌. ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ కూడా సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నాకున్న అనుభవంతో ప్రాక్టీకల్ గా ఉండే సమస్యలను వివరించాను. ఇతర రాష్ట్రాల కంటే టారీఫ్ ఎక్కువే గానే ఇక్కడ కార్మికులకు ఉంది. లేబర్‌ కమిషన్‌ రూల్స్‌ ప్రకారం సినిమాలకు పని చేయలేం. రూల్స్ ప్రకారం భోజనం పెట్టాల్సిన అవసరంలేదు. కానీ, ఖర్చులు భరిస్తూ కార్మికులకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. ఓ ఫ్యామిలీలా అందరం కలిసి వర్క్ చేసుకోవటం అలవాటు అయిపొయింది. త్వరలో ఇష్యూ సాల్వ్ అవుతుందని నమ్ముతున్నాను." అని సి. కళ్యాణ్ చెప్పారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .