English | Telugu

సైకలాజికల్ థ్రిల్లర్ “బుడుగు” షూటింగ్ పూర్తి

ఈ రోజుల్లో పిల్లల పై రకరకాల ఒత్తిడి పెరిగి, వారినది అయోమయానికి గురిచేస్తుంది. అలాంటి అయోమయం లో ఉన్న ఎనిమిదేళ్ళ పిల్ల్లాడికి కొన్ని విచిత్ర సంఘటనలు ఎదురైతే, ఆ పిల్లాడు ఏం చేస్తాడు. ఆ పిల్లాడి వల్ల, అతని కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది. వాటి కారణాలను విశ్లేషిస్తూ, అన్వేషిస్తూ ఉత్కంటతో సాగుతూ వెళ్ళే ఒక సైకలాజికల్ థ్రిల్లర్ కథే “బుడుగు”. బుడుగు లో మంచు లక్ష్మి, శ్రీధర్ రావ్, మాస్టర్ ప్రేం బాబు, బేబీ డాలి, ఇందు ఆనంద్, సన తదితరులు నటించగా, ఒక ప్రత్యెక పాత్ర లో “ఇంద్రజ” నటించారు. బుడుగు నేటితొ షూటింగ్ పూర్తి చేసుకొ౦ది. “ఇది యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన సినిమా. సినిమా లోని నటి నటులతో ముందుగానే “రీడింగ్ సెషన్స్, వర్క్ షాప్స్” లతో రిహార్సల్స్ చేయడం వలన షూటింగ్ చాల సాఫీగా జరిగింది. పిల్లలతో కూడిన సైకలాజికల్ థ్రిల్లర్ కాబట్టి షూటింగ్ సమయలోను, ముందుగాను సైకాలజిస్ట్ సలహాలు తీసుకోవడం జరిగింది. ఈ వారంలో ఎడిటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని వచ్చే వారంలో డబ్బింగ్ కార్యక్రమాలు పుర్తిచేసుకొంటాం”. అని దర్శకుడు మన్మోహన్ చెప్పారు. బుడుగు “హైదరాబాద్ ఇన్నోవేటివ్స్” బ్యానర్ పై, భాస్కర్ మరియు సారిక శ్రీనివాస్ నిర్మిస్తుండగా శ్యాం మె౦గా ఎడిటింగ్, ఎ. రాం కళా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ఎక్షిక్యుటివ్ ప్రోడుసర్ గా వంశీ పులురి వ్యవహరిస్తుండగా, సంగీతం సాయి కార్తిక్, సినిమాటోగ్రఫి సురేష్ రగుతు అందిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.