English | Telugu

యన్ టి ఆర్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ సినిమా

యన్ టి ఆర్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ సినిమా తీయబోతున్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే ఇటీవల మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జెనీలియా హీరోయిన్ గా, నాగబాబు నిర్మించిన "ఆరెంజ్" సినిమాకి దర్శకత్వం వహించిన బొమ్మరిల్లు భాస్కర్, ఆ సినిమా ఫ్లాపవటానికి మూల కారణమయ్యాడన్న నిందలను నెత్తికెత్తుకున్నాడు. కానీ అదే బొమ్మరిల్లు భాస్కర్ మరో చక్కని కథని తయారుచేసి, ఆ కథ సింగిల్ లైన్ ఆర్డర్ ను యంగ్ టైగర్ యన్ టి ఆర్ కి వినిపించాడట. ఆ కథ సింగిల్ లైన్ నచ్చిన యన్ టి ఆర్ దాన్ని పూర్తి స్క్రిప్ట్ గా డెవలప్ చేసి తీసుకురమ్మన్నారట.

బొమ్మరిల్లు భాస్కర్ ఆ కథను ఆ విధంగా డెవలప్ చేసి యన్ టి ఆర్ కి వినిపించగా, దానికి యన్ టి ఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. యన్ టి ఆర్ ప్రస్తుతం సురేంద్రరెడ్డి దర్శకత్వంలో, తమన్నా హీరోయిన్ గా, కె.యస్.రామారావు నిర్మిస్తున్న "ఊసరవెల్లి" సినిమాలోనూ, బోయపాటి దర్శకత్వంలో, శృతిహాసన్ హీరోయిన్ గా, బి.వి.యస్.యన్.ప్రసాద్ నిర్మిస్తున్న "చురకత్తి" సినిమాలోనూ నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత శ్రీనువైట్ల సినిమాలో నటించటానికి అంగీకరించినట్లు సమాచారం. ఈ మూడు సినిమాలు పూర్తికాగానే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించే సినిమాలో యన్ టి ఆర్ నటిస్తారని తెలిసింది.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.