English | Telugu

బద్రీనాథ్ ప్లాట్ భారత సినీ చరిత్రలో రాలేదు- చిన్నికృష్ణ

"బద్రీనాథ్" ప్లాట్ భారత సినీ చరిత్రలో రాలేదు అని ఆ చిత్ర రచయిత చిన్ని కృష్ణ మీడియాకు తెలియజేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మిల్కీవైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, డైనమిక్ డైనమిక్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో, మెగా నిర్మాత అల్లు అర్జున్ నిర్మించిన చిత్రం "బద్రీనాథ్". "బద్రీనాథ్" సినిమా జూన్ పదవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ "బద్రీనాథ్" సినిమా గురించి ఈ చిత్ర కథా రచయిత చిన్ని కృష్ణ మీడియాతో మాట్లాడారు. ఆ విషయాలు మీ కోసం...

"బద్రీనాథ్ ప్లాట్ అంటే సెంట్రల్ పాయింట్ ఇంతవరకూ భారతదేశ సినీ చరిత్రలో రాలేదు. నేను 200 వ సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమకొచ్చాను. నాకు తెలిసి నరసింహనాయుడు, ఇంద్ర, పోకిరి, మగధీర ఈ నాలుగు సినిమాలు రికార్డ్ ని క్రియేట్ చేసిన సినిమాలు. "బద్రీనాథ్" ఆ కోవలో అయిదవ సినిమా అవుతుంది. "బద్రీనాథ్" ఫ్లాపయితే ఆ పూర్తి బాధ్యత నాదే. ఈ మాట నేనెందుకంటున్నానంటే స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకం. ఈ కథ నా మానస పుత్రిక. నా కొడుకు పేరు బద్రీనాథ్. నా కూతురు పేరు అలకనంద. ఆ పేర్లే ఈ సినిమాలో హీరోకీ, హీరోయిన్లకూ పెట్టానంటే ఈ కథను నేనేంతగా ప్రేమించానో మీకర్థమయి ఉంటుంది. ఇది సోషియో ఫాంటసీ సినిమా కాదు. ఇదొక కాంటెంపరరీ సినిమా.

ఈ సినిమాకి వినాయక్ గారి దర్శకత్వం హైలైట్. అలాగే రాజీపడకుండా స్క్రిప్ట్ డిమాండ్ చేసిన మేరకు 22 సెట్లు వేయాలంటే ఆ సెట్స్ వేసి, సినిమాని రిచ్ గా తీసిన అల్లు అరవింద్ గారి నిర్మాణపు విలువలు హైలైట్. కీరవాణి గారి మ్యూజిక్ ఒక హైలైట్. హీరో అల్లు అర్జున్ నటన ఈ సినిమాకి పెద్ద హైలైట్ అని చెప్పాలి. గంగోత్రి సినిమాకీ బద్రీనాథ్ సినిమాకీ పోలిస్తే అల్లు అర్జున్ నటనలో చాలా మెచ్యూరిటీ వచ్చింది. ఇంద్ర సినిమా కథలో కాశీని చూపించే ప్రయత్నం చేశాను. నరసింహనాయుడులో నరసింహస్వామి గురించి, బద్రీనాథ్ సినిమాలో బద్రీనాథుడి గురించి చూపించాలనే ప్రయత్నం చేశాను. నేను దేవుణ్ణి నమ్ముకుని కథను రాస్తాను. నా రాబోయే సినిమా కథల్లో కూడా ఏదో ఒక పుణ్యం క్షేత్రం గురించి గానీ, దేవుడి గురించి కానీ తప్పకుండా ఉంటుంది" అని అన్నారు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.