English | Telugu
పవన్ కళ్యాణ్ వల్లే ఆ కోరిక పుట్టిందట!
Updated : Sep 9, 2023
పవన్‌కళ్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రీకరణ కాస్త వెనకబడిరదని ఇటీవల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై చిత్ర నిర్మాత ఎ.ఎం.రత్నం క్లారిటీ ఇస్తూ ఈ ఏడాది చివరి వరకు షూటింగ్ పూర్తవుతుందని తెలిపారు. వచ్చే ఎన్నికల లోపే ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ఆయన చెప్పారు. మెగా సూర్య మూవీస్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇదిలా ఉండగా, ఈ సినిమాలోని యుద్ధ సన్నివేశాల కోసం ‘షావలిన్ వారియర్ మంక్ అకాడమి’లో పవన్‌కల్యాణ్ శిక్షణ తీసుకున్నారు. హర్ష్‌వర్మ ఆయనకు ఈ విషయంలో ట్రైనర్‌గా వ్యవహరించారు. విశేషమేమిటంటే ఈ సినిమాలో హర్ష్‌వర్మ కూడా నటిస్తున్నారు. ట్రైనర్‌గా ఉన్న తను నటుడిగా మారడం ఎలా జరిగిందని అడిగిన ప్రశ్నకు హర్ష్ సమాధానమిస్తూ ‘పవన్‌కళ్యాణ్ వల్లే నాకు నటించాలన్న కోరిక కలిగింది. ఆయనతో కలిసి ఈ సినిమాలో నటించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. పవన్‌కళ్యాణ్‌లో ఎన్నో మంచి క్వాలిటీస్ ఉన్నాయి. చిన్న విషయాన్ని కూడా ఎంతో నిశితంగా పరిశీలిస్తారు. నేను శిక్షణ ఇచ్చే సమయంలో నాకూ నటన మీద ఆసక్తి ఉందని చెప్పగానే లుక్ టెస్ట్ చేయించారు. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు. దీనితోపాటు బాలీవుడ్ సినిమాల్లోనూ నేను నటిస్తున్నాను’ అన్నారు.